ఆధార్ కార్డు అంటే ?ఆధార్...సామాన్యుని హక్కు బయోమెట్రిక్ కార్డుల వల్ల ఎవరైనా... ఎక్కడైనా...ఠక్కున గుర్తించవచ్చు. ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో 'జాతీయ
జనాభా రిజిస్టర్' తయారీ, 'జాతీయ పౌర
గుర్తింపు కార్డు లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ తిరిగి
వేలి ముద్రలు ఫొటోలు నమోదు చేసి గుర్తింపు కార్డులు రూపొందిస్తారు.
దేశ పౌరులందరికీ
12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యనిచ్చి
‘ఆధార్’ కార్డ్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వం ఫిబ్రవరి 2009లో నిర్ణ యించింది. పేదరికాన్ని నిర్మూలిం చడం, ఉగ్రవాదాన్ని అణిచి వేయడం, ప్రభుత్వ పథకాలు, ఇన్స్యూరెన్స్, బ్యాంక్ లావాదేవీలు, ఉద్యోగాలు, ఇతరాలు సకాలంలో అసలెైన వ్యక్తులకు అందేలా చూడడం ఆధార్ కార్డు ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు మన పాల కుల మస్తిష్కంలో పుట్టింది కాదు. ఇ- ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనీషియే టివ్‌గా ఈ ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు ప్రవేశపెట్టి, వర్ధమాన దేశాలు అనుసరించేలా చూస్తోంది. ప్రపంచబ్యాంకు విధానాలకు తలఒగ్గే మన పాలకులు అభివృద్ధి పేరిట ఈ ప్రాజెక్టు అమలుకు ఒప్పుకున్నారు. మన దేశంలో ఆధార్‌కార్డు ప్రాజెక్టు అమలుకు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకోవడానికి, అభివృద్ధి పరచడా నికి అమెరికా సంస్థలు కాంట్రాక్టులు పొందాయి.
మొన్న రేషన్ కార్డు! నిన్న గుర్తింపు కార్డు! నేడు ఆధార్ కార్డు! మరి రేపేమిటొ? ప్రజల బ్రతుకిక త్రిశంకు స్వర్గామేనా ? ఏ దేశమేగినా ఎందుకాల్లిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని! అన్నాడు గురజాడ. ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా ప్రజలకు తప్పవు కస్టాలు అంటున్నాయి మన ప్రభుత్వాలు. రేషన్ కార్డు లేకుంటే గుప్పెడు మెతుకులు కూడా దొరకవు అనే స్థాయి నుండి ఆధార్ కార్డు లేకుంటే వండుకోవడానికి గ్యాస్ కూడా కష్టం అనే స్థాయి కి పెరిగాయి ప్రజల తిప్పలు .
ఇకపై ఉప్పు కావాలన్నా..పప్పు కావాలన్నా..గాస్ కావాలన్నా..బ్యాంక్ అకౌంటు తెరవాలన్నా... అన్ని నిత్యావసరాలకి ...దేనికయినా ఆధారం ఇదే...మీరు మీరే అనటానికి ఇకనుండి ఋజు పత్రం (identity proof) ఇదే
ఆధార్ కార్డు పుట్టుకకు నేపథ్యం ఏమిటి ?భారతదేశంలో ప్రజలకు గుర్తింపు ఇవ్వటం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్ట్రార్(
http://ditnpr.nic.in/), ఎన్నికల సంఘం ద్వారా ప్రజలందరికీ గుర్తింపు కార్డు ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలలో రేషన్ కార్డు(
http://www.apcivilsupplies.gov.in/)లను ఇస్తున్నాయి. బోగస్ కార్డులున్నాయనే పేరుతో ఐరిష్ టెక్నాలజీతో కూడా కార్డులను ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి పోందే ఏ
పథకానికైనా, ఉద్యోగం, స్కాలర్‌షిప్పులు, సర్టిఫికెట్లు, ఇతర అవసరాలకు పై కార్డులనే ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రాతిపదికగా తీసుకుంటోంది. ఆ కార్డులు ఉండగానే ఆధార్ కార్డును ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.
ఆధార్ ఇలా పొందొచ్చు..
‘యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(
UIDAI) సంస్థ ద్వారా జారీ అయ్యే ఈ కార్డులను ప్రతి భారత పౌరుడికీ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనంది. . ఆధార్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని రాష్ట్రంలోని అన్ని పంచాయతీ కేంద్రాలు, జిల్లాలోని ఇతర కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.
ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు అధికారులు సమాచారాన్ని అందిస్తారు. అప్పుడు ఫొటోతో ఉన్న ఏదైనా గుర్తింపు పత్రాన్ని, నివాస ధ్రువీకరణ పత్రాన్ని తప్పకుండా తీసుకెళ్లాలి. ఏ కార్డు లేకపోతే ఎవరైనా ఆధార్ గుర్తింపు అధికారి నుంచి సహకారాన్ని పొందొచ్చు.
అక్కడ ఇచ్చే ఆధార్ ఫారంలో పేరు, పుట్టినతేదీ, లింగం, చిరునామాలను నమోదు చేసి గుర్తింపును తెలియజేసే ఐడెంటిటీ కార్డు జిరాక్స్‌ను పొందుపరచి అధికారులకు అందజేయాలి. తర్వాత బయోమెట్రిక్ విధానం ద్వారా శారీరక గుర్తులను అధికారులు నమోదు చేసుకుంటారు. ఇందులో భాగంగా వ్యక్తులను ఫొటో తీయడంతో పాటు
కళ్లను ఐరిస్ చేస్తారు. వేలి ముద్రలను సైతం నమోదు చేస్తారు. ఆన్లైన్ లో ఆధార్ కార్డు(Aadhaar card Online)
చాలా కాలంగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని, కార్డు అందని వారు అధికార వెబ్ సైట్ నుండి కార్డు సమాచారానికి సంబంధించిన వివరాలను ప్రింట్ తీసుకొని, దానిని ఆధార్ కార్డు తప్పనిసరి కార్యకలాపాలకు ఆధారంగా చూపవచ్చు
ఆధార్ కార్డు వెబ్సైట్ నుండి ఈ వివరాల పేపర్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆధార్ కార్డు దరఖాస్తు నెంబర్ మరియు దరఖాస్తు చేసుకున్న తేదీ, సమయం తప్పనిసరిగా ఉండాలి(Enrolment No. and Date time ). ఈ వివరాలను పొందు పర్చిన తరువాతనే ఆధార్ కార్డుకు సంభంధించిన పూర్తి వివరాల పేపర్ తీసుకోవచ్చు.
ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే పూర్తి విధానం ఈ క్రింది విధంగా:
ఇప్పుడు ప్రభుత్వం ఆధార్ కార్డులను ఇంటర్‌నెట్‌లో పొందే సౌలభ్యం కల్పించింది. ఆధార్ కార్డు రానివారు.
http://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం యూఐడీఏఐ కల్పించింది
- మీ ఆధార్ కార్డు దరఖాస్తు నెంబరు, తేదీ, సమయం దగ్గరు ఉంచుకోండి. ఈ వివరాలు మీ దరఖాస్తు చేసిన సమయంలో ఇచ్చిన రశీదు లో పొందుపర్చి ఉంటుంది.(Enrollment No.)
- వెబ్సైట్ లో మీ పేరు, పిన్ కోడ్, దరఖాస్తు నెంబర్, తేదీ, సమయం పొందు పర్చి “సబ్మిట్”(Submit) చేయండి.
- అనంతరం మీ మొబైల్ నంబర్ పై 4 అంకెల ఒక సంఖ్య(OTP) వస్తుంది. ఈ సంఖ్య ను వెబ్సైట్ లో నిర్దేశిత ప్రదేశంలో వ్రాసి “యెస్(yes) ” ని ఎంచుకోండి. అనంతరం మీ మొబైల్ పై ఒక రహస్య పాస్వర్డ్ వస్తుంది.
- ఈ పాస్ వర్డ్ ను నిర్దేశిత ప్రదేశంలో పొందుపర్చి న వెంటనే కంప్యూటర్ లో మీ ఆధార్ కార్డు లేఖకు సంబంధించి ఒక “లింక్” వస్తుంది. ఆ లింక్ ను క్లిక్ చేసి ఆధార్ కార్డు సంబంధించిన వివరాల లేఖను పొందవచ్చు. ఈ లేఖను పొందేందుకు మీ ప్రాంత పిన్ కోడ్ పొందుపర్చవాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు వివరాలు మార్చుకోవడం ఎలా ?
5.ఆధార్ కార్డులో వివరాలు నమోదు చేసేటప్పుడు కొన్ని తప్పులు (Errors)ఉండి ఉండొచ్చు. వాటిని కూడా నేరుగా వెబ్‌సైట్(Website) లోనే సరిచేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ వెబ్‌సైట్‌లో కుడివైపు (right side) ఉన్న
‘అప్‌డేట్ యువర్ ఆధార్ డేటా’update your Aadhaar data'
అనే లింకును క్లిక్ చేయాలి.
6.మీ ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేస్తే.. అప్పుడు మొబైల్ ఫోనుకు పాస్‌వర్డ్ (Password) వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే స్క్రీన్ మీద మార్చడానికి వీలున్న వివరాలన్నీ కనిపిస్తాయి.అయితే.. చిరునామా(Address), పుట్టిన తేదీ (Date of Birth) లాంటి వివరాలు మార్చాలంటే మాత్రం అందుకు సంబంధించిన ఆధారాల(Documents)ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ (upload)చేయాల్సి ఉంటుంది.
7.అలా చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. తర్వాత కొత్త ఆధార్ కార్డును పోస్టులో పంపుతారు. ముందుగా వెబ్‌సైట్‌లో వచ్చే ఈ కార్డును కూడా ప్రింటవుట్ తీసుకుని ఉపయోగించుకోవచ్చు.
8.ఆధార్ కార్డు SMS ద్వార :
Type
UID STATUS <14 Digit EID>
and send it to
51969
if your enrollment number is 1001/15161/01426, then send
UID STATUS 10011516101426
to
51969
లాభాలు (Advantages)
1.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాను ఆధార్ కార్డుతో ముడిపెట్టిందీ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. తమ ఖాతా దారులకు ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది. 2.ఆధార్ వుంటేనే పథకం అమలు3.గ్యాస్ కనెక్షన్(Gas connection) కు ఆధార్ కార్డు నెంబర్ 4.సబ్సిడీల వర్తింపుకు ప్రభుత్వం ఆధార్ కార్డు తప్పని సరి
5.ఉపాధి హామీ పథకానికి ఆధార్,ఆరోగ్య సేవలు పొందాలన్నా.. పిల్లాణ్ని బళ్లో చేర్చాలన్నా
6.ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు,మొబైల్ కనెక్షన్ కోసం
7.ఆధార్ కార్డు లేకపోతే రేషన్ మాత్రమే కాదు వంటగ్యాస్, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, ముఖ్యమయిన డాక్యుమెంట్ల సమర్పణ వంటివి కుదరవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి
8.ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ల కోసం వి ద్యార్థులకు తప్పనిసరి చేసిన ఆధార్ కార్డు
UIDAI Helpline
- Telephone – 1800-180-1947
- Fax – 080-2353 1947
- Letters – PO Box 1947, GPO Bangalore - 560001
- Email - help@uidai.gov.in