Thứ Sáu, 30 tháng 1, 2015

How to cut mp3 songs in vlc player and merge mp3 songs

Recording in VLC Player

 
Step 1: Launch Vlc player and in the top menu goto View option and click Advanced Controls
Step 2:  Click the Advanced Controls option in the top menu 4 new Options will appear in the bottom of the player and above play,pause buttons.
Step 3: The first button in the 4 options gives you the option to record. Actually we are not cutting mp3 but recording .
Step 4: Choose the time range from where you want to record(cut) the mp3 file and click the record button .You can end recording
manually by again clicking on record button or just close the vlc player it will automatically save your file.
Step 5: To check the recorded file whether it is recorded correctly or not open the My Computer in the left sidebar navigation of your player and then goto My Music.

 Merging mp3 songs

http://www.shchuka.com/software/mergemp3/#download

to merge songs download mergemp3

select the files in FILE menu then select FILE -->MERGE(Ctrl+M)

Thứ Ba, 20 tháng 1, 2015

ఫేస్‌'బుక్‌' (Facebook) నష్టాలూ



ఫేస్‌బుక్. తో లాభాలే కాదు.. నష్టాలూ అదే స్థాయిలో ఉన్నాయి.
అపరిచిత వ్యక్తుల స్నేహం అసలే వద్దు
అనవసర కామెంట్లకు దూరంగా ఉండడమే మేలు
పర్సనల్ డేటా.. ఫొటోలు అప్‌లోడ్ చేయొద్దు
లేదంటే లైఫ్ రిస్క్‌లో పడడం ఖాయం
 
బినామీ అకౌంట్లతో బీకేర్‌ఫుల్
కొందరు బినామీ పేర్లతో ఫేస్‌బుక్ అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్‌లతో ఫ్రిండ్‌షిప్ పెంచుకుని వారితో చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగాసెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు.ఇలాంటివన్నీ బినామీ అకౌంట్ల నుంచే పంపుతున్నారు. వీటి వల్ల వచ్చే సమస్యలతో అమాయకులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి సంఘట నలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గానీ బినామీల సంగతి బయటకు రావడం లేదు

 ఆ నోట.. ఈ నోట.. ఫేస్‌బుక్ మాట
ఫేస్‌బుక్.. ఈ మధ్యకాలంలో యువత నోట్లో బాగా నానుతున్న మాట. స్నేహితులను ఆన్‌లైన్‌లో కలుసుకోవడంతోపాటు ఏ సందర్భమైనా అందరితో పంచుకునేందుకు, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు వీలుగా దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహశుభాకాంక్షలు, విషాద సంఘటనలు సందర్భం ఏదైనా ఫేస్‌బుక్‌లో ఇట్టే ప్రత్యక్షమవ్వాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ విస్తరించినసోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్‌బుక్ ప్రాచుర్యం పొందింది. యువత రోజువారీకార్యకలాపాల్లో ఫేస్‌బుక్ ఒక భాగమైపోయింది. ఫేస్‌బుక్‌లో లాగిన్ అయి ఏదో ఒకటిపోస్టు చేస్తేనే కాస్తంత సరదా...

 తల్లిదండ్రులు దృష్టి సారించాలి
సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తే అదోవిజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లతో ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే పిల్లలు ఈ వ్యసనానికి బానిసలయ్యే అవకాశం ఉంది.

లైక్‌లు లేవని బెంగ వద్దు
ఫేస్‌బుక్ అంటేనే ఫేక్‌బుక్ వంటిది. అలాంటిది తాము ఎన్నిసార్లు పోస్టుచేసినా ఎవరూ లైక్ కొట్టడం లేదని అసలే కుంగిపోవద్దు. ఎన్ని ఎక్కువ లైక్‌లు వస్తే అంత పాపులర్ అరుు నట్లు.. తక్కువగా వస్తే పట్టించుకోవడం లేదని అసలే ఆలోచించొద్దు. లేదా తమను ఫ్రెండ్ జాబితా నుంచి తొలగించారని మదనపడడంలాంటివి చేయొద్దు. ఎన్నోరకాల సామాజిక వెబ్‌సైట్ల మాదిరిగానే దీన్ని పరిగణించాలి.  

ఏ మేరకు వినియోగించాలి..

స్నేహితులతో టచ్‌లో ఉండడం.. కొత్త స్నేహాలను సంపాదించుకోవడం. ప్రపంచసమాచార వేదికపై అప్‌డేట్‌గా ఉండడం.
ప్రపంచంలోని కొత్త, మంచి విషయూలనునేర్చుకోవడం.
ఏ ఫొటో, కామెంట్ పోస్టింగ్ చేసినా తమ ఇమేజ్‌ను పెంచేలా.. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి.
ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు.
ఫొటోలు, కామెంట్స్ పోస్టింగ్ విషయంలోగందరగోళం ఉండరాదు. నోటి నుంచి జారిన మాట.. ఫేస్‌బుక్‌లో ఎంటర్ చేసిన కామెంట్ ఒకటేనని గుర్తుంచుకోవాలి.
ఫేస్‌బుక్‌లోకి వెళ్లగానే పెద్దసంఖ్యలో ఫొటోలు, కామెంట్లు పెట్టడం వృథా. అంతగా చదివే ఓపిక ఎవరికీ ఉండదని గుర్తుంచుకోవాలి.
ఫొటో అప్‌లోడ్ చేసే ముందే దాన్ని ఒకటికిరెండుసార్లు చూడండి.. కామెంట్లను చదవండి అంతేకానీ  పోస్ట్ చేశాక తలలు పట్టుకుంటే చేసేదేమీ ఉండదు.
 
ఇవి అసలే వద్దు
అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు, ఇంటి వివరాలు, చిరునామాలు, ఫొటోలు పెట్టొద్దు.
తమ కార్యాలయం.. చేస్తున్న ఉద్యోగంపై రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ఉండొద్దు.
మందుకొట్టి బైక్ డ్రైవ్ చేశానని, మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేశానని పోస్ట్‌చేసి అనవసర రిస్క్‌లు వద్దు.
ఒకప్పటి ప్రేమలు, పెళ్లిళ్లపై వ్యాఖ్యలు వద్దు.
స్నేహితుల పోస్ట్‌లు.. కామెంట్లపై తీవ్రంగా స్పందించడం.. సవాల్ విసరడం లాంటివి చేయొద్దు.
స్నేహితుల ఫొటోలు వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం మంచిది కాదు.
మనసు బాగోలేనప్పుడు ఫేస్‌బుక్‌లోకి వెళ్లవద్దు.
ఆఫీసు విషయూలు.. కుటుంబ సమస్యలు.. పర్సనల్‌ముచ్చట్లు వద్దు.
వ్యంగమైన చిత్రాలు పెట్టడం..
మరొకరిని కించ పరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం.. కామెంట్లు పెట్టడం చేయొద్దు.
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తికి డబ్బులు లావాదేవీలు జరపడం.. వినోదాలకు పిలిస్తే వెళ్లడం లాంటివి అసలేవద్దు.
  
రెచ్చగొట్టే.. అవమానపరిచే ఫొటోలకు లైక్‌లు కొట్టడంచిక్కుల్లో పడేందుకేనని గుర్తుంచుకోవాలి.

అమ్మాయిలూ.. జర జాగ్రత్త

ఫేస్‌బుక్ అనేది స్నేహానికి వారధి మాత్రమేనన్న విషయాన్ని మరిచిపోయి చాలా మంది దానికి బానిసలవుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్‌ముందు కూర్చుని పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లుతో కాలం గడిపేస్తున్నారు. ఫేస్‌బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమేకాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అవుతూ ఊచలు లెక్కిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌లో స్నేహం చేయడం వల్ల ముఖ్యంగా అమ్మాయిలు చాలాఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

సెట్టింగ్స్ తప్పనిసరి...

ఫేస్‌బుక్ నుంచి ప్రమాదంలోకి పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. అలాగే విలువైన వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌లో పెట్టకపోవడం ఉత్తమం. మనం పోస్టు చేసే చిత్రాలు, కామెంట్స్‌ని మన సమీపం వారే చూసేలా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్కు ఓకే చెప్పకూడదు.

తెలిసిన వారా లేదాఅని ఆక్సెప్ట్ చేయడం మంచిది. అనవసర ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేయడం సమస్యలకు స్వాగతం పలికినట్లేనని గుర్తుంచుకోవాలి. చాలావరకు ఫేస్‌బుక్ అకౌంట్లలో అసత్యాలే ఎక్కువగా ఉంటాయి. ఎవరో కావాలనే యువతుల పేర్లు.. ఫొటోలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. అలాంటివారే రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. వాటిబారిన పడి మోసపోవద్దు.

source:www.sakshi.com

Thứ Hai, 19 tháng 1, 2015

క్లౌడ్ కంప్యూటింగ్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఐటీ అనుబంధ(ITES) సంస్థల్లో కెరీర్స్ అంటే సాధారణంగా గుర్తొచ్చే విభాగాలు.. ప్రోగ్రామింగ్(Programming), ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్(Project Managment), డేటా మైనింగ్(Data mining), అప్లికేషన్స్. వీటితోపాటు ఐటీ రంగంలో ఇప్పుడు ఎమర్జింగ్ సెగ్మెంట్‌గా మారుతున్న విభాగం..  
క్లౌడ్ కంప్యూటింగ్. తాజాగా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐటీ రంగ నియామకాల్లో 20 నుంచి 25 శాతం మేర క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫైల్స్‌కు చెందినవే.


కంపెనీలు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేస్తున్న వాటిల్లోనూ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. భవిష్యత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. సాఫ్ట్‌వేర్ సేవలను సరళతరం చేస్తూ పుష్కల అవకాశాలకు దోహదం చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్‌పై విశ్లేషణ..



‘ఆధునిక ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ రూపొందించి వినియోగదారుల ఆదరణ పొందాలి. ఇప్పుడు ఇందుకు సరైన సాధనం.. క్లౌడ్ కంప్యూటింగ్. యువ సాఫ్ట్‌వేర్ నిపుణులు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో రాణించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల  కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలివి. సాఫ్ట్‌వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ ఆవశ్యకతను తెలిపే మాటలివి. దేశంలో అనేక సాఫ్ట్‌వేర్ సంస్థలు వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. పోటీదారుల కంటే ముందుండేందుకు నిరంతరం కొత్త టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాధాన్యం పెరుగుతోంది.

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే(What is Cloud Computing)
ఐటీ సంస్థలు తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. అందులో భాగంగా ఎన్నో ప్రోగ్రామ్స్, అప్లికేషన్ టూల్స్, నెట్‌వర్క్ ఛానెల్స్‌ను రూపొందిస్తుంటాయి. వీటన్నిటి స్టోరేజ్ కంపెనీలకు వ్యయభారంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆవిష్కృతమైన సరికొత్త టెక్నాలజీ.. క్లౌడ్ కంప్యూటింగ్! భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్, లాన్ లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా ఈ-మెయిల్స్ ద్వారా నిర్దిష్ట సేవలను అవసరమైనప్పుడు అందించడమే.. క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కంపెనీల వ్యయ భారాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ సేవలను సదరు ప్రొవైడర్ నుంచి సులువుగా ఈ-మెయిల్ ద్వారా పొందొచ్చు. ఇప్పటివరకు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినప్పుడు దానిపై అవగాహన వచ్చే వరకు ప్రొవైడింగ్ సంస్థల ప్రతినిధులు వినియోగదారుల వద్ద ఉండాల్సి వచ్చేది. క్లౌడ్ కంప్యూటింగ్‌తో ఈ-మెయిల్స్, ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఉదాహరణకు: ఒక వినియోగదారుడి కంప్యూటర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కే పరిమితమైంది. కానీ దానికి భిన్నంగా ఉండే మరో అప్లికేషన్(ఉదా: యాపిల్ మ్యాక్) పొందాల్సిన అవసరం ఏర్పడింది.

అలాంటప్పుడు యాపిల్ మ్యాక్ ప్రొవైడర్స్ నుంచి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి, ఈ-మెయిల్ ద్వారా సొంతం చేసుకుని యాపిల్ మ్యాక్ అప్లికేషన్స్‌ను వినియోగించుకోవచ్చు. దీనికి ఆ ప్రొవైడర్స్ నిర్దేశించే మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే.. స్థూలంగా ఇంటర్నెట్ ఆధారంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్/సర్వీసెస్‌ను అయినా అందించే, సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించే విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్.

పెరుగుతున్న డిమాండ్
పోటీ ప్రపంచంలో సంస్థలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ప్రతి రెండు, మూడేళ్లకు కొత్త కొత్త వెర్షన్‌లు ఆవిష్కృతమవుతున్నాయి. దాంతో అన్నిటినీ కొనుగోలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా కంపెనీలకు డేటా స్టోరేజ్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది.

క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మేరకే సదరు సర్వీసెస్ పొందే అవకాశం లభిస్తుంది. అందుకే గత రెండుమూడేళ్లుగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఇలా ఐటీ రంగంలో దాదాపు అన్ని కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు ఉన్న వారి కోసం అన్వేషిస్తున్నాయి.

లక్షల్లో అవకాశాలు
ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ నియామకాల సంఖ్య లక్షల్లో నమోదు కానుంది. నాస్‌కామ్, సీఐఐ, ఐబీఎం వంటి సంస్థల సర్వేల ప్రకారం- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఈ ఏడాది భారీగా రిక్రూట్‌మెంట్ జరుగనుంది. మరోవైపు 2015 చివరి నాటికి అంతర్జాతీయంగా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం 70 బిలియన్ డాలర్ల మేర కార్యకలాపాలు నమోదు చేసుకోనుంది.

26 శాతం వార్షిక వృద్ధి సాధిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఈ ఏడాదిలోనే 15 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించనుందని నిపుణుల అంచనా. వీటిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో నిలవనుంది. భారత్ మూడు లక్షలకుపైగా ఉద్యోగావకాశాలతో మూడో స్థానం పొందనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

అవసరమైన నైపుణ్యాలు
క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో స్థిరపడాలనుకునేవారికి హెచ్‌టీఎంఎల్(HTML), వర్చువలైజేషన్ టెక్నాలజీస్(Virtualization technologies), జావా(Java), సీ++(C++), డాట్ నెట్(.Net) వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్ వంటి కోర్ నైపుణ్యాలు అవసరం. అదేవిధంగా వెబ్ డెవలప్‌మెంట్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనాలిసిస్ తదితర యూజర్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉద్యోగ సాధనకు ఉపకరించే అదనపు నైపుణ్యాలు.

క్లౌడ్ కోర్సులు
క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి ప్రస్తుతం అకడమిక్‌గా ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు లేవు. దీంతో కంపెనీలు బీటెక్ స్థాయిలో ఈసీఈ, సీఎస్‌ఈ బ్రాంచ్‌ల విద్యార్థులను నియమించుకుని, సొంతంగా శిక్షణనిచ్చి క్లౌడ్ నైపుణ్యాలు నేర్పిస్త్తున్నాయి. జేఎన్‌టీయూ, ట్రిపుల్‌ఐటీ, సీ-డాక్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేసే సాఫ్ట్‌వేర్ కోర్సుల్లోనే క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్స్‌ను అందిస్తున్నాయి.

క్లౌడ్ కంప్యూటింగ్‌కు గ్రాడ్యుయేషన్‌లో పూర్తి స్థాయి కోర్సులు లేకున్నా.. రీసెర్చ్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌ల్లో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ-బాంబే, ఐబీఎం-ఇండియా రీసెర్చ్ ల్యాబ్, టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్, హెచ్‌పీ లేబొరేటరీల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందుకోసం అవి ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా ఔత్సాహికులను ఎంపిక చేస్తున్నాయి.

సర్టిఫికేషన్స్
పూర్తి స్థాయిలో కోర్సులు లేని క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్, ఈఎంసీ, వీఎంవేర్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు పలు సర్టిఫికేషన్‌‌స ఆఫర్ చేస్తున్నాయి.

అవి.. ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్, ప్రొఫెషనల్ క్లౌడ్ డెవలపర్, ప్రొఫెషనల్ క్లౌడ్ సెక్యూరిటీ మేనేజర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, వెండార్ అలైన్‌మెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్, వర్చువలైజేషన్ ఆఫ్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్టిఫికేషన్ వంటివి.

ఆకర్షణీయ వేతనాలు
సర్టిఫికేషన్ కోర్సులు లేదా కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలు పొందినవారికి.. ఈ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్; నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్; ప్రొడక్ట్ మేనేజర్; సేల్స్ ఎగ్జిక్యూటివ్; క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్; క్లౌడ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ సిస్టమ్స్ ఇంజనీర్ వంటి హోదాలు లభిస్తాయి. ఈ రంగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు ఎంట్రీ లెవల్‌లోనే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో వార్షిక వేతనం లభిస్తుంది. మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్‌కు దాదాపు రూ.15 లక్షలు; ఆరేడేళ్ల అనుభవం ఉన్న వారికి రూ.20 లక్షల మేర వార్షిక వేతనం ఖాయం.

క్లౌడ్ సర్టిఫికేషన్స్- ముఖ్య వెబ్‌సైట్స్

http://www-03.ibm.com/certify/certs/50001201.shtml
http://www8.hp.com/us/en/training/portfolio/cloud.html
education.emc.com
www.cloudschool.com
www.microsoft.com/learning
https://www.itpreneurs.com/it-training-products/cloud-computing/cloud/ l www.cdac.in  l www.snia.org.
www.cloudcomputingtraining.co.in
www.cloudcredential.org