Thứ Bảy, 4 tháng 5, 2013

How to create a free website --- ఉచితంగా వెబ్సైటు క్రేయట్ చేయవచ్చా ?

                          ప్రస్తుత కాలంలో ప్రతీ సంస్థ కు website అనేది తప్పని సరి అయ్యింది. సంస్థ ఉనికి ప్రపంచానికి
 చాటడానికి ,తన వ్యాపారాన్ని విస్తరిమ్చుకోవడానికి Website అనేది ఎంతో దోహదం చేస్తుంది. అయితే ప్రతి సంస్థ తన Website ను నిర్వహించుకోవడానికి ప్రతీ Year కొంత మొత్తం వేచ్చిమ్చక తప్పదు. Website Domain Registration ,వెబ్సైటు హోస్టింగ్చెయ్యడానికి కూడా నిర్వహణ వ్యయం అవుతుంది . (డొమైన్ అంటే వెబ్సైటు పేరు ఉదాహరణకుహోస్టింగ్ అంటే వెబ్సైటు లో ఉండే పేజీలు ,ఫైల్స్ అన్ని ఒక సర్వర్ లోఉంచి అక్కడ నుండి ఆన్ లైన్ లో ఉంచడం ). www.eenadu.net,www.sakshi.com), అయితే పెద్ద పెద్ద సంస్థలు ఈ ఖర్చులు భరిస్తాయి .కానీ చిన్న చిన్న షాప్స్ ,స్వయం ఉపాది సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి అనుకొనేవారు ఎటువంటి ఖర్చు లేకుండా Website Create చేసుకోవచ్చు. వీరి అవసరాలకు సరిపోయేవిదం గా కొన్ని Website లు Free గా పేజీలను కేటాయిస్తున్నాయి .
ఉదాహరణకు www.webs.com ,www.freeservers.com

ఈ వెబ్సైటు లో కి వెళ్లి మన ఈమెయిలు తో లాగిన్ అయ్యి అక్కడ ఉన్న టూల్స్ తో వెబ్ పేజీలను Create చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి సాంకేతిక నైపుణ్యం ఆవసరం లేదు . మనకు సొంత Domain కావాలి అనుకొంటే మాత్రం Domain కొరకు సుమారు 500 /- రూపాయలు చెల్లిమ్చావలిసి ఉంటుంది (www.yourname.com).లేని యెడల సబ్ డొమైన్ తోఅంటే (www .yourname .webs .com ) తో ఫ్రీ గా Website Create చేసుకోవచ్చు .

ఈ వెబ్ పేజీలలో మనకు కావలిసిన టెక్స్ట్(Text) ,చిత్రాలు(Pictures) ,లింక్(Links) లు కూడా పెట్టుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి .అలాగేమనకు కావలిసిన థీమ్స్(Themes) కూడా ఎంచుకోవచ్చు http://www.freeservers.com/ అయితే మన ఫ్రీ వెబ్సైటు తో పాటు గా mailbox ను కూడా ఇస్తుంది . 

మనకు ఫ్రీ గా ఇస్తే వారికీ లాభం ఏమిటి ?

ఈ వెబ్సైటు లు మనకు వెబ్ పేజీలను ,మెయిల్ బాక్స్ లను ఇవ్వడమే కాదుమనద్వారా ఆదాయాన్ని కూడా పొందుతాయి .మనం క్రేఅట్ చేసుకొన్న పేజీలలోఇవి యాడ్స్ పెట్టుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందుతాయి 

వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేసి Lookup అనే బటన్‍ని క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి..

నేడు వెబ్‌ డిజైనింగ్‌ అనేది ఓ కళగా మారింది. వెబ్‌ డిజైనర్లు తమ ఆలోచనా శక్తితో ఎంతో సృజనాత్మకంగా పలు రకాల వెబ్‌సైట్‌లను తీర్చిదిద్దుతున్నారు. సైట్‌లోని హోమ్‌ పేజీతో పాటు వివిధ రకాల పేజీలను అందంగా మలచే పని ని వెబ్‌ డిజైనర్లు చూసుకుంటున్నారు. వెబ్‌ డిజైనర్లు వెబ్‌ డెవలపర్లతో కలిసి వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసి దాన్ని అభివృద్ది పరుస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ డాక్యు మెంట్లు, అప్లికేషన్స్‌ను రూపొందిస్తూ వెబ్‌సైట్‌ పేజీలను ఆకర్షణీయంగా మలుస్తున్నారు. అత్యాధునిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పేజీలలో స్పెషల్‌ ఎఫెక్ట్‌‌సను సృష్టిస్తున్నారు. వెక్టార్‌ గ్రాఫిక్స్‌, యానిమేషన్‌, వీడియోస్‌, సౌండ్స్‌ను వినియోగిస్తూ సైట్‌ పేజీలను ఆకట్టుకునేవిధంగా రూపొందిస్తున్నారు. అడోబ్‌ ఫ్లాష్‌, క్విక్‌ టైమ్‌, జావా వంటి సాఫ్ట్‌వేర్‌లను డిజైనర్లు వినియోగిస్తున్నారు. నేడు వెబ్‌ డిజైనర్లు సైట్‌లో స్టాటిక్‌, డైనమిక్‌ పేజీలను రూపొందిస్తున్నారు. స్టాటిక్‌ పేజీలలలో సమాచారాన్ని రోజూ మార్చకుండా ఎప్పుడో ఒకసారి మారుస్తుంటారు. వెబ్‌పేజీ లేఅవుట్‌, డిజైనింగ్‌లో కూడా పెద్దగా మార్పు ఉండదు. డైనమిక్‌ పేజీలలో సమాచారాన్ని ప్రతి రోజు మారుస్తుం టారు. ఉదాహరణకు వివిధ డైలీ న్యూస్‌ పేపర్లు ఏర్పాటు చేసుకున్న వెబ్‌సైట్లలో రోజంతా వివిధ రకాల సమాచారాన్ని పొందుపరుస్తూ పాత సమాచారాన్ని తొలగిస్తుంటారు. రోజు, రోజుకూ కొత్త ఫొటోలను సైట్‌లో పొందుపరుస్తుంటారు.

వెబ్‌ డెవలపింగ్‌లో నేడు యానిమేషన్‌, ఆథరింగ్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, కార్పోరేట్‌ ఐడెంటిటీ, గ్రాఫిక్‌ డిజైన్‌, హ్యూమన్‌ కంప్యూటర్‌ ఇంటరాక్షన్‌, ఇన్‌ఫర్మేషన్‌ ఆర్కిటెక్చర్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌, మార్కెటింగ్‌, ఫొటోగ్రఫీ, సెర్చ్‌ ఇంజైన్‌ ఆప్టిమైజేషన్‌, టైపోగ్రఫీ వంటి వాటిని వినియోగిస్తున్నారు. వెబ్‌డి జైనింగ్‌లో హెచ్‌టిఎంఎల్‌, ఎక్స్‌హెచ్‌ టిఎంఎల్‌, ఎక్స్‌ఎంఎల్‌ వంటి మార్క్‌అప్‌ లాంగ్వేజెస్‌, సిఎస్‌ఎస్‌, ఎక్స్‌ఎస్‌ఎల్‌ వంటి స్టైల్‌ షీట్‌ లాంగ్వేజెస్‌, జావా స్క్రిప్ట్‌ వంటి క్లైంట్‌ సైడ్‌ స్క్రిప్టింగ్‌, పిహెచ్‌పి, ఎఎస్‌పి వంటి సర్వర్‌ సైడ్‌ స్క్రిప్టింగ్‌, మైైఎస్‌ క్యూఎల్‌, పోస్ట్‌గ్రేఎస్‌ క్యూఎల్‌ వంటి డాటాబేస్‌ టెక్నాలజీస్‌, ఫ్లాష్‌, సిల్వర్‌ లైట్‌ వంటి మల్టీమీడియా టెక్నాలజీస్‌ను వినియోగిస్తూ సైట్‌ పేజీలను రూపొందిస్తున్నారు. ఇక వెబ్‌ డిజైనింగ్‌ గురించి మొదట తెలియజేసింది టిమ్‌ బెర్నెర్స్‌లీ. ఆయన 1991 ఆగస్టులో వెబ్‌ డిజైనింగ్‌ గురించి ఓ పుస్తకాన్ని రాశారు. ఆయన ఇంటర్నెట్‌, వెబ్‌సైట్‌లు, సైట్‌ల డిజైనింగ్‌ తదితరాల గురించి ఇందులో వివరించారు.

వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌...
worldఎవరైనా సరే ఇంటర్నెట్‌లో సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవడం చాలా సులభంగా మారింది. నేడు వెబ్‌సైట్‌లు డాట్‌ కామ్‌, డాట్‌ ఇన్‌, డాట్‌ నెట్‌, డాట్‌ ఒఆర్‌జిలతో ఏర్పడుతున్నాయి. ఏవైనా సంస్థలు, వ్యక్తులు సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు వెబ్‌డెవలపింగ్‌, డిజైనింగ్‌ సంస్థలను సంప్రదిస్తున్నారు. ఈ సంస్థలు వెబ్‌సైట్‌ను ప్రారంభించడం మొదలుకొని వాటి డిజైనింగ్‌, అప్‌లోడింగ్‌ వంటివన్నింటినీ చూసుకుంటున్నాయి. ఇక ఎవరైనా ఏదైనా పేరుతో నెట్‌లో వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు నేడు నెట్‌లో ఓ వెబ్‌సైట్‌ ఉండడం విశేషం. www.godaddy.com లోకి వెళ్లి అందులో కొత్తగా ఎవరైనా వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌ను క్రియేట్‌చేసుకునే సౌకర్యం ఉండడం విశేషం. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలకు అనుగుణంగా వివిధ మొత్తాలను చెల్లించి వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌ను కొనుగోలుచేయవచ్చు. ఇందుకుగాను 600రూ.ల నుంచి రెండు,మూడు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక ఇంటర్నెట్‌లో స్పేస్‌ను కొనుగోలుచేసేందుకు వెబ్‌ హోస్టింగ్‌సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. సైట్‌లోని వివిధ పేజీలను ఏర్పాటుచేసుకునేందుకు ఈ స్పేస్‌ అవసరమవుతుంది. ఇందులో 1 జిబి, 2 జిబిలు మొదలుకొని అన్‌లిమిటెడ్‌ స్పేస్‌ నేడు నెట్‌లో అందుబాటులో ఉంది. ఇందుకుగాను వేయి రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ స్పేస్‌ కొనుగోలు అనంతరం వెబ్‌డిజైనర్లు, వెబ్‌ డెవలపర్లు కలిసి వెబ్‌సైట్‌ను డెవలప్‌ చేస్తారు. వెబ్‌సైట్‌లోని పేజీలను వెబ్‌ డిజైనర్‌ రూపొందిస్తూ ఆ పేజీలకు సంబంధించిన ప్రోగ్రామ్‌, కోడింగ్‌, అప్లికేషన్స్‌ వంటి వాటిని వెబ్‌ డెవలపర్‌ రూపొందిస్తాడు. వెబ్‌ డిజైనర్లు, డెవలపర్లు సమిష్టిగా పనిచేస్తూ వెబ్‌సైట్‌లోని పేజీలలో సమాచారం, ఫొటోలను రోజు మార్చడం, ఫ్లాష్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తూ ప్రత్యేక సమాచారం, అడ్వర్టైజ్‌మెంట్లను రూపొందించడం వంటివి నిర్వహిస్తారు.

సొంతంగా వెబ్‌సైట్‌...
ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసుకోవడం నేడు చాలా సులభంగా మారింది. ముందుగా డొమైన్‌ నేమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన అనంతరం నెట్‌లో స్పేస్‌ కొనుగోలుచేస్తే చాలు సైట్‌ ప్రారంభమైనట్టే. వివిధ సంస్థలు, వ్యక్తులు వెబ్‌సైట్‌లో అవసరమైన మేరకు పేజీలను రూపొందించాలని చెబితే దాని ప్రకారం వెబ్‌ డిజైనింగ్‌, డెవలపింగ్‌ కొనసాగుతుంది. నేడు అందుబాటులో ఉన్న హెచ్‌టిఎంఎల్‌, ఎక్స్‌హెచ్‌టిఎంఎల్‌, ఎక్స్‌ఎంఎల్‌ వంటి మార్క్‌అప్‌ లాంగ్వేజెస్‌, సిఎస్‌ఎస్‌, ఎక్స్‌ఎస్‌ఎల్‌ వంటి స్టైల్‌ షీట్‌ లాంగ్వేజెస్‌, జావా స్క్రిప్ట్‌ వంటి క్లైంట్‌ సైడ్‌ స్క్రిప్టింగ్‌, పిహెచ్‌పి, ఎఎస్‌పి వంటి సర్వర్‌ సైడ్‌ స్క్రిప్టింగ్‌, మైైఎస్‌క్యూఎల్‌, పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్‌ వంటి డాటాబేస్‌ టెక్నాలజీస్‌, ఫ్లాష్‌ , సిల్వర్‌లైట్‌ వంటి మల్టీమీడియా టెక్నాలజీస్‌ను వినియోగిస్తూ వెబ్‌సైట్‌ను పూర్తిగా డెవలప్‌ చేయడం జరుగుతుంది. నేడు పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో పాటు పలువురు వ్యక్తులు సొంతంగా వెబ్‌సైట్‌లను రూపొందించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

Không có nhận xét nào:

Đăng nhận xét