Thứ Tư, 9 tháng 4, 2014

How to Start Blog Step by Step బ్లాగింగ్‌ బాతాఖానీ ...!

బ్లాగ్‌ అంటే ఏమిటి? దానిని ఎలా క్రియేట్‌(Create) చేసుకోవాలి? ఒకవేళ చేసుకున్నా... దాన్ని ఆకర్షణీయంగా(Designing) ఎలా తీర్చిదిద్దుకోవాలి? రకరకాల సమాచారాన్ని(Information) బ్లాగ్‌లో ఎలా పెట్టుకోవాలి?
    1.మన ఆలోచనలు, దినచర్యలాంటివి నమోదు చేయడానికి వాడే పుస్తకాన్ని డైరీ అని పిలుస్తాం. ఇంటర్నెట్‌ ద్వారా అందుబాటులో వుండే అటువంటి సమాచారం కలిగిన వెబ్‌పేజీని బ్లాగ్‌ అంటారు. ఒకే వ్యక్తి ప్రచురించే పత్రికగా కూడా అర్థం చేసుకోవచ్చు. డైరీలో వ్యక్తిగత అభిప్రాయాలు, భావాలు రాసుకున్నట్లుగానే బ్లాగ్‌లోనూ రాసుకుంటాము.
    2.బ్లాగ్‌లో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని చేర్చడం కోసం చేసే ప్రక్రియను బ్లాగింగ్‌ అంటారు. ఈ పని చేసేవారిని బ్లాగర్‌ అంటారు. బ్లాగింగ్‌ అనేది బ్లాగ్‌కు సంబంధించిన అన్ని రకాల పనులకు ఉద్దేశించి వాడే పదం. ఎప్పటికప్పుడు బ్లాగ్‌లో సమాచారాన్ని వుంచే ప్రక్రియను నిర్దిష్టంగా చెప్పాలంటే పోస్టింగ్‌ అంటారు. 

    3.డేటా, ఇమేజెస్‌, వీడియో, ఆడియో తదితరాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఈ బ్లాగ్‌లను పరిశీలిస్తే విలక్షణమైన సమాచారం మనకు కనబడుతుంది. వ్యక్తిగత అభిప్రాయాలు, కవితలు, కథలు దగ్గర నుండి తాజా వార్తలు, విశేషాల వరకు వుంటాయి. అంతేకాదు... ఇతరులతో చెప్పుకోలేనివి బ్లాగులో పంచుకుంటారు. 

    4.ప్రేమ, విరహం, బాధ, ఆరాధన, ఆవేదన, ద్వేషం అన్నీ ఇందులో కనిపిస్తాయి. ముఖ్యంగా తెలుగులో ఇప్పుడిప్పుడే ప్రముఖ రచయితలు, సాహితీవేత్తల బ్లాగులతోపాటు సాంకేతిక విజ్ఞానాన్ని పంచే బ్లాగులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇవేకాదు! కుట్లు- అల్లికలు, వంటవార్పు దగ్గర నుండి సినిమాలు, సాంకేతిక విషయాల వరకూ అనేక బ్లాగులున్నాయి.
    ప్రారంభం(Start)
             Step 1:  బ్లాగ్‌(BLOG) ప్రారంభించాలనుకున్నప్పుడు ముందుగా మనం ఏ అంశానికి సంబంధించి బ్లాగ్‌ను పెట్టదలచుకున్నామో.. దానికి అనుగుణంగా శీర్షిక (TITLE‌) ఆలోచించి పెట్టుకోవాలి. దీన్ని తెలుగు(TELUGU) లో కూడా పెట్టుకోవచ్చు. ఈ టైటిల్‌కు అందమైన ట్యాగ్‌లైన్‌ కూడా జతచేయవచ్చు. దీనిలో ముఖ్యమైంది బ్లాగ్‌ అడ్రస్‌ (URL‌)... మనం అనుకునే టైటిల్‌కి తగినట్లుగా బ్లాగ్‌ అడ్రస్‌ కూడా ఎంపిక చేసుకోవాలి. అందరికీ గుర్తుండేలా, సింపుల్‌గా వుండేలా చూసుకోవాలి.
           Step 2: ఇక అసలు విషయానికొస్తే... బ్లాగ్‌ ప్రారంభించాలంటే మనకో ఇమెయిల్‌ అడ్రస్‌(e-mail address ) వుండాలి. యుఆర్‌ఎల్‌(URL)  అడ్రస్‌ దగ్గర www.blogger.com అని టైప్‌ చేసి ఎంటర్‌ ప్రెస్‌ చేస్తే... ఓపెన్‌ అయ్యే పేజీలో 'క్రియేట్‌ ఎ బ్లాగ్‌... గెట్‌ స్టార్ట్‌'(CREATE A BLOG) అని వుంటుంది. 'గెట్‌ స్టార్ట్‌' బటన్‌పైన క్లిక్‌ చేస్తే 'క్రియేట్‌ గూగుల్‌ ఎకౌంట్‌' పేజీ అనే పేజీ వస్తుంది. దీనిలో ఇమెయిల్‌ ఐడి, పాస్‌వర్డ్‌, డిస్‌ప్లే నేమ్‌ తదితర అంశాలను పూర్తిచేసి కంటిన్యూ బటన్‌పై ప్రెస్‌ చేయాలి. తర్వాత వచ్చే పేజీ 'నేమ్‌ బ్లాగ్‌'. ఇందులో మన బ్లాగ్‌ టైటిల్‌, బ్లాగ్‌ యుఆర్‌ఎల్‌ ఇవాలి. బ్లాగ్‌ యుఆర్‌ఎల్‌ కింద 'చెక్‌ ఎవైలబిలిటీ'(CHECK AVAILABILITY)ని క్లిక్‌ చేయడం ద్వారా మనకు కావాల్సిన యుఆర్‌ఎల్‌ అందుబాటులో వుందో లేదో తెలుసుకోవచ్చు.

        Step 3:   ఆ తర్వాత కంటిన్యూ అంటే.. మూడో స్టెప్‌లోకి వెళతాం. అది 'చూజ్‌ టెంప్లేట్(CHOOSE TEMPLATE)‌'. దీనిలో బ్లాక్‌ పేజీ నమూనాలో ఏ రంగులో కావాలో.. దాన్ని సెలెక్ట్‌ చేసుకొని చివరలోనున్న కంటిన్యూ బటన్‌ ప్రెస్‌ చేస్తే వచ్చే పేజీలో 'యువర్‌ బ్లాగ్‌ హేజ్‌బీన్‌ క్రియేటెడ్‌' అని వస్తుంది. ఆ చివరలో 'స్టార్ట్‌ బ్లాగింగ్‌' అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే, డిస్‌ప్లే నేమ్‌లో మనం ఇచ్చిన టైటిల్‌తో ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. ఇందులో మొదటి ఆప్షన్‌ పోస్టింగ్(POSTING)‌. 
                           ఈ పోస్టింగ్‌లో పైన కనిపించే టైటిల్‌ దగ్గర మనం పోస్టు చేసే సమాచారం యొక్క శీర్షికను టైప్‌ చేయాలి. దానికిందనే ఖాళీగా వున్న ప్రాంతంలో సమాచారం టైప్‌ చేసుకోవాలి. ఈ సమాచారం ఆకర్షణీయంగా పెట్టుకునేందుకు కావాల్సిన టూల్స్‌ కూడా ఈ బాక్స్‌లోనే లభ్యమవుతాయి. ఈ బాక్సుకు దిగువనున్న 'పబ్లిష్‌ పోస్ట్‌' అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే మన సమాచారం బ్లాగ్‌లోకి వెళ్ళిపోతుంది. అందులో కనిపించే 'వ్యూబ్లాగ్‌'పై క్లిక్‌ చేస్తే మనం క్రియేట్‌ చేసుకున్న బ్లాగ్‌ పేజీ మనం పోస్టు చేసిన సమాచారంతో ఎంచక్కా కనిపిస్తుంది.

    Step 4: ఇంతవరకు ఎక్కువమంది చేస్తూనే వుంటారు. ఆ తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. మనం క్రియేట్‌ చేసుకున్న బ్లాగ్‌ మనం ఒక్కరమే చూస్తే సరిపోతుందా! అందరికీ చూపాలనే ఆసక్తి ఎలాగూ వుంటుంది. అయితే దీనికో మార్గం వుంది. తెలుగు బ్లాగ్‌లన్నిటినీ ఒకేచోట చూసేందుకు వీలుకల్పించే కొన్ని సైట్స్‌ వున్నాయి. వీటినే అగ్రిగేటర్స్‌ (Aggregrators)అంటారు.

    Step 5: కూడలి (http://koodali.org/), మాలిక (http://maalika.org/), జల్లెడ (http://www.jalleda.com/), హారం (http://haaram.com/), తెలుగు బ్లాగర్స్‌ (http://www.telugubloggers.com/).,
    A2Z Dreams (a2zdreams.com/aggregator) , Telugu Web Media (teluguwebmedia.asia/)

    .వీటిలో మన బ్లాగ్‌ను జతచేయమని వారికి ఓ రిక్వెస్ట్‌ మెయిల్‌ చేయాలి. అంతే...మన బ్లాగ్‌లో కొత్త పోస్టు చేసిన ప్రతిసారీ వీటిలో జత చేయబడతాయి. ఒక్కో అగ్రిగేటర్‌లో వెయ్యినుంచి మూడువేల వరకు బ్లాగులున్నాయి. బ్లాగ్‌లలోని సమాచారాన్ని బట్టి వీటిని కేటగిరీలుగా కూడా విభజించారు. మిగతా వివరాలు ఆ సైట్‌లోకి వెళ్ళి చూడొచ్చు.
                                           అలంకరణ(DESIGNING)
    Step 6:    బ్లాగ్‌ క్రియేట్‌ చేయడం, ఎక్కువమంది చూసే విధంగా అగ్రిగేటర్స్‌లో జత చేయడం వరకు బాగానేవుంది. ఎక్కువమంది చూసేటప్పుడు ఆ బ్లాగ్‌లో మంచి సమాచారం వుండాలి. అదేవిధంగా ఆకట్టుకునే విధంగానూ వుండాలి. సమాచారం అంటే రాసేస్తారనుకోండి.. మరి బ్లాగ్‌ ఆకట్టుకునే విధంగా వుండాలంటే కొన్ని ట్రిక్కులు చేయాల్సిందే.
                      బ్లాగ్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత డాష్‌బోర్డ్‌(DASHBOARD)లో డిజైన్‌ అనే ఆప్షన్‌ వుంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే పేజీ లేఅవుట్‌(PAGE LAYOUT) కనిపిస్తుంది. దీని పైభాగంలో 'టెంప్లేట్‌ డిజైనర్‌'(TEMPLATE DESIGNER) అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే పేజీ రెండు భాగాలుగా కనిపిస్తుంది. పైభాగంలో టెంప్లేట్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌, లేఅవుట్‌, అడ్వాన్స్‌ అనే ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఇందులో నుండి మనకు కావాల్సిన కలర్స్‌, ఫాంట్స్‌, బ్యాక్‌గ్రౌండ్స్‌ అన్నిటినీ మార్పులు చేసుకోవచ్చు.డిజైన్‌లోనే ఎడిట్‌ హెచ్‌టిఎంఎల్‌ అనే మరో ఆప్షన్‌ వుంది. దీని ద్వారా మనం కోరుకున్న నమూనాలో బ్లాగ్‌ను తయారుచేసుకోవచ్చు. వందల కొంది బ్లాగ్‌ నమూనాలను అందించేందుకు రకరకాల సైట్లు వున్నాయి. వీటినే బ్లాగ్‌ టెంప్లేట్స్‌ అంటారు. Read More

                              బ్లాగ్‌ టెంప్లేట్స్‌ అందించే కొన్ని సైట్లు

    Step 7: 
    http://btemplates.com/
    http://blogger-templates.blogspot.com/
    http://www.ourblogtemplates.com/
    http://eblogtemplates.com/
    www.blogbulk.com/
    http://www.deluxetemplates.net/
    http://finalsense.com/
    http://wpbloggerthemes.blogspot.co/
    http://www.ipietoon.com/
    http://www.bloggerstyles.com/

    బ్లాగ్‌ టెంప్లేట్స్‌ అందించే సైట్లనుండి మనకు నచ్చిన టెంప్లేట్‌ను డౌన్లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అది జిప్‌ ఫార్మేట్‌లో వుంటుంది. అది అన్‌జిప్‌ చేసి చూస్తే ఆ ఫోల్డర్‌ ఎక్స్‌ఎంఎల్‌ ఫైల్‌ ఒకటి కనిపిస్తుంది. దాన్నలా వుంచి ఎడిట్‌ హెచ్‌టిఎంఎల్‌ పేజీలో బ్యాకప్‌/రీస్టోర్‌ టెంప్లేట్‌ అనే ఆప్షన్‌లో ''డౌన్లోడ్‌ టెంప్లేట్‌''పై క్లిక్‌ చేస్తే మన బ్లాగ్‌ మైడాక్యుమెంట్స్‌లో డౌన్లోడ్‌ అవుతుంది. ఇది ఎందుకంటే, పాత టెంప్లేటే కావాలంటే తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ డౌన్లోడ్‌ కిందనే వున్న బ్రౌజ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే ఫైల్‌ అప్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఒక ప్యాలెట్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మనం డౌన్లోడ్‌ చేసుకున్న టెంప్లేట్‌లోని ఎక్స్‌ఎంఎల్‌ ఫైల్‌ను సెలెక్ట్‌ చేసుకొని అప్‌లోడ్‌ అనాలి. అప్పుడు ఒక మెసేజ్‌ చూపుతుంది. పాత సెట్టింగ్స్‌ వుంచాలా తీసేయాలా? అని. పాత సెట్టింగ్స్‌ వుంచుకొని ఓకె అనాలి. ఆ తర్వాత వ్యూబ్లాగ్‌ అంటే కొంత టెంప్లేట్‌తో కొత్త బ్లాగ్‌ రెడీ.
                  మనం చేస్తున్న పోస్టింగ్స్‌ పెద్దగా వుంటే పేజీ లెంగ్త్‌ బాగా పెరిగిపోతుంది. పేజీ మొదటి నాలుగైదు వాక్యాల తర్వాత ''రీడ్‌ మోర్‌'' ఆప్షన్‌ వుంటే ఎంచక్కా మొదటి పేజీలో ఎక్కువ పోస్టింగ్స్‌ కనిపిస్తాయి. చదువుకునేందుకు కూడా అనువుగా వుంటుంది. 
    Step 8: మరి ఈ రీడ్‌ మోర్‌ ఆప్షన్‌ యాడ్‌ చేయాలంటే పోస్టింగ్‌ ప్యాలెట్‌ పైభాగంలో కనిపించే టూల్స్‌లో ''ఇన్‌సెర్ట్‌ జంప్‌ బ్రేక్‌'' అనే బటన్‌ వుంటుంది. బ్లాగ్‌ పేజీలో సమాచారం ఎన్ని వాక్యాలు చూపించాలనుకుంటామో, వాటి పక్కనే మౌస్‌ కర్సర్‌ వుంచి 'ఇన్‌సెర్ట్‌ జంప్‌ బ్రేక్‌' బటన్‌పై క్లిక్‌ చేసి, పబ్లిష్‌ పోస్ట్‌ అనాలి. అంతే బ్లాగ్‌ మొదటి పేజీలో మీరు ఎన్నిలైన్స్‌ చూపాలనుకుంటారో అంతే కనిపిస్తాయి.

    Step 9: అదేవిధంగా వీడియోస్‌ జత చేయాలనుకోండి. పైన చెప్పిన బటన్‌ పక్కనే ''ఇన్‌సెర్ట్‌ వీడియోస్‌'' అనే బటన్‌ వుంటుంది. దీని నుండి యాడ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్‌ ద్వారా మన కంప్యూటర్‌లో వున్న వీడియోస్‌ను మాత్రమే యాడ్‌ చేసుకోగలుగుతాము. అయితే ఇప్పుడంతా ఏ రకమైన వీడియోలు కావాలన్నా దొరికే ప్రముఖమైన సైట్‌ 'http://www.youtube.com. దీనిలోనుండి యాడ్‌ చేసుకోవాలంటే- ఆ సైట్‌లోకి వెళ్ళి కావాల్సిన వీడియోను ఎంపిక చేసుకోవాలి. 
                         ఉదాహరణకు యూట్యూబ్‌ సెర్చ్‌లో 'మహాకవి శ్రీశ్రీ' టైప్‌ చేస్తే ఆయనకు సంబంధించిన వీడియోలన్నీ కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంపిక చేసుకొని దానిపై క్లిక్‌ చేస్తే, ఆ వీడియో ఓపెన్‌ అవుతుంది. దాని కిందే 'ఎంబెడ్‌' అనే బటన్‌ వుంటుంది. ఆ బటన్‌మీద క్లిక్‌ చేస్తే ఆ వీడియోకి సంబంధించిన కోడింగ్‌ కనిపిస్తుంది. దాన్ని కాపీచేసుకొని - మన బ్లాగ్‌లోని డిజైన్‌లో 'యాడ్‌ ఎ గాడ్జెట్‌' అనే బటన్స్‌ కనిపిస్తుంటాయి. ఆ గాడ్జెట్స్‌లో ఒకటి ఎంపిక చేసుకొని క్లిక్‌ చేస్తే, ఆ గాడ్జెట్‌ ఫీచర్స్‌ కనిపిస్తాయి. దానిలో ''హెచ్‌టిఎంఎల్‌/జావాస్క్రిప్ట్‌' అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత వచ్చే ప్యాలెట్‌లో యూట్యూబ్‌ నుండి కాపీ చేసుకున్న కోడింగ్‌ను పేస్ట్‌ చేసి, సేవ్‌ అనాలి. అంతే ఆ వీడియో మన బ్లాగ్‌లో కనిపిస్తుంది. ఆ వీడియో సైజును కూడా పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చు. అదే విధంగా ఆడియో కూడా యాడ్‌ చేసుకోవచ్చు.
    Step 10 :వీటితోపాటు రకరకాల విడ్జెట్స్‌ నెట్‌లో అందుబాటులో వున్నాయి. వాటి ద్వారా ఫొటో స్లైడ్‌ షోలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడర్స్‌, గడియారాలు, సైట్‌ స్టాటిస్టిక్స్‌ జతచేయవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు! మీరూ ఓ బ్లాగ్‌ క్రియేట్‌ చేసి, మీకు నచ్చిన అంశాలను బ్లాగింగ్‌ చేయవచ్చు.
                               for training on BLOG tutorials PLEASE CALL  9704017704 

                                        Visit Regularly: http://syedrafiq.blogspot.com
                                  

    Không có nhận xét nào:

    Đăng nhận xét