Computer,Online ఉపయోగిస్తున్న వారు పాస్‌వర్డ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ,
పాస్వర్డ్ ఇచ్చేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:
1.పాస్ వర్డ్ అన్నది సింపుల్ గా ఉండకూడదు(చాలా మంది పాస్ వర్డ్ గా వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు పెట్తుకుంటారు.) తెలిసిన వారి ఊహ కందే విధంగా పాస్వర్డ్ ఉండకూడదు.కనీసం 13 నుండి 14 క్యారెక్టర్లు ఉండాలి.
పాస్వర్డ్ లో ఒక అంకె , ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక క్యాపిటల్ లెటర్, , ఒక స్మాల్ లెటర్ ఉండాలి.
పాస్వర్డ్ లో ఒక అంకె , ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక క్యాపిటల్ లెటర్, , ఒక స్మాల్ లెటర్ ఉండాలి.
2.పాస్వర్డ్ ఎంటర్ చేసే చోట కీ లాగర్స్ ఉన్నయేమో చూసుకోవాలి,ఒక వేళ ఉన్నట్లయితే అవి మీ పాస్వర్డ్ ను పట్టేస్తాయి. అవి ఉన్నచోట పాస్వర్డ్ ను ఎంటర్ చేయకూడదు.బయటి ప్రాంతాల్లో ( ఇంటర్నెట్ లలో ఈ విషయం గుర్తుంచుకోక తప్పదు.)
3.మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసే వెబ్సైటు నిజమైనదా లేక నకిలీదా అన్న సంగతి కూడా పరిశీలించుకోవాలి.మీరు పాస్వర్డు ఎంటర్ చేసే ముందు ఎస్ .ఎస్. ఎల్.(SSL) సర్టిఫికేట్(లాగ్ సింబల్ లో ) ఉందో లేదో సరి చూసుకోవాలి.అది హెచ్.టి. టి.పి.ఎస్.(https://) కనెక్షన్ అయితే మంచిది.దాదాపు అన్ని మెయిల్ సర్వీసులు (జిమెయిల్, యాహూ,హాట్మెయిల్ మున్నగునవి) హెచ్.టి.పి.ఎస్. నే వాడుతున్నాయి.అన్నిటికన్నా ముఖ్యంగా యూ.ఆర్.ఎల్. సరైనదీ కానిదీ చూసుకోవాలి
4యూజర్‌నేమ్‌లకు, పాస్‌వర్డ్‌లకు నిక్‌నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, పెట్నేమ్స్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు. కొందరు Rediiff, YaHOO, Gmail కు ఒకే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌నుఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒక దాని పాస్‌వర్డ్ తెలిస్తే అన్నిఅకౌంట్లలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది
.
5.పాస్వర్డ్ ప్రతిసారీ టైప్ చెయ్యటమెందుకులే అని కొందరు బద్ధకించి కంప్యూటర్ కి పాస్వర్డ్ గుర్తుంచుకోమన్న ఆదేశాన్ని ఇస్తారు.పర్సనల్ కంప్యూటర్ల కి మినహా ఇది ఇంకెక్కడా అంత శ్రేయస్కరం కాదు.
5.పాస్వర్డ్ ప్రతిసారీ టైప్ చెయ్యటమెందుకులే అని కొందరు బద్ధకించి కంప్యూటర్ కి పాస్వర్డ్ గుర్తుంచుకోమన్న ఆదేశాన్ని ఇస్తారు.పర్సనల్ కంప్యూటర్ల కి మినహా ఇది ఇంకెక్కడా అంత శ్రేయస్కరం కాదు.
6.ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి, ఆరు అక్షరాలు ఉన్న ఎలాంటి పాస్ వర్డ్ నైనా 8 గంటలలో ఛేదించవచ్చు .అదే ఏడు అక్షరాలున్న పాస్‍వర్డ్ ని ఛేదించడానికి రెండు రోజులు పదుతుంది.కానీ ఎనిమిది అక్షరాలు ఉన్న పాస్‍వర్డ్ ని ఛేదించడానికి అచ్చంగా మూడు సంవత్సరాల కాలం కావాలి
7. పాస్‌వర్డ్ చిన్నగా ఉంటే సులభంగా గెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్ వీలైనంత పొడవుగా ఉండేలా చూసుకోవాలి. క్యారెక్టర్‌లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, పాస్‌వర్డ్‌లో పెద్దఅక్షరాలు, చిన్న అక్షరాలు మిళితమై ఉండేలా జాగ్రత్త పడటం, అంకెలు ఉండేలాపెట్టుకోవడం చేయాలి.
8. ఇంగ్లీషు డిక్షనరీలోని పదాలను అసలు ఉపయోగించవద్దు. 12345678 అంకెలనుపెట్టుకోవడం,(abcdef..)ను వరుస క్రమంలో ఉపయోగించడం అసలుమంచిది కాదు. పుట్టి పెరిగిన ఊరు పేరు, పిల్లల పేర్లు ఉపయోగిస్తే సులువుగా ఇతరులు గెస్ చేయడానికి అస్కారం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకూడదు.
9 కీబోర్డుపై (qwert,asdf,zxcv)పక్కపక్కన ఉండే అక్షరాలను వాడకూడదు. పాస్‌వర్డ్‌లోస్పెల్లింగ్ తప్పుగా ఉండేటట్లుగా చూసుకోవడం, మధ్యలో అంకెలను ఉపయోగిస్తేమంచిది.
10.మెయిల్ ఓపెన్ చేసేటప్పుడు చాలా మంది ఎవ్వరూ కనుక్కోలేనివిధంగా పాస్‌వర్డ్ ఇవ్వాలని పప్పులో కాలేస్తుంటారు. ఒక్కోసారి పాస్‌వర్డ్ గుర్తురాక నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య ఎదురుకాకుండాఉండాలంటే..పాస్‌వర్డ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కారునెంబర్లు, లేదా బైక్ నెంబర్లతో వారికి ఇష్టమైన పువ్వుల నెంబర్లు మిళితం చేసి ఇవ్వవచ్చు.
ఉదా: మీ కారు నెంబర్ AP04 అనుకోండి. మీకిష్టమైన పువ్వు లిల్లీ (lily) అనుకోండి. అప్పుడు మీ పాస్‌వర్డ్ నెంబర్ alpi014y ఇవ్వవచ్చు..అదేవిధంగా మీరు Chinky అని పాస్ వర్డ్ ఇవ్వాలనుకున్నారనుకోండి. ఇందులో ఒకటిబిగ్‌లెటర్, ఒకటి స్మాల్ లెటర్ కూడా ఇవ్వవచ్చు. అప్పుడు CinkY ఈ విధంగాఅన్నమాట.
ఇంకాస్త క్రియేటివిటీగా ఇవ్వాలనుకుంటే 1=1, 5=S, 0=o. అంటే 150 నెంబర్‌కు బదులుగా ఇంగ్లీష్ అక్షరాలన్నమాట.ఒక మాటను షార్ట్‌గా చేసి ఇచ్చుకోవచ్చు. అదెలాగంటే ' Handy for you ' అని ఇవ్వాలనుకున్నారనుకోండి. ' hAnDy4U ' అని ఇవ్వవచ్చు..మీపాస్‌వర్డ్‌ను ఆరు నెలలకోసారి మార్చుకోవడం మంచిదని నిపుణులు చెపుతున్నారు.
Password గురించి విశేషాలు :
ప్రతీ హార్డ్ వేర్ కంపెనీ తమ ఉత్పత్తులకు కొన్ని డీఫాల్ట్ పాస్ వర్డ్ లు సెట్ చేస్తుంది. కొత్తగా కొన్న సెల్ ఫోన్ ఇంటర్నల్ మెమరీని ఫార్మేట్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు “మీ పాస్ వర్డ్ ఎంటర్ చెయ్యండి” అని అడిగితే మనం తెల్లమొహం వేస్తుంటాం. “మనమెప్పుడు పాస్ వర్డ్ సెట్ చేశాం” అని కాసేపు ఆలోచనలో పడతాం. అది అడుగుతోంది డీఫాల్ట్ పాస్ వర్డ్ నే. ఉదా.కు.. Sony Ericsson ఫోన్లకు డీఫాల్ట్ పాస్ వర్డ్ 0000 (నాలుగు సున్నాలు ఉంటుంది). ఇలా చెప్పుకుంటూ పోతే ఫోన్లకు, కేబుల్ మోడెమ్ లకు, routersకి, లాప్ టాప్ లకు.. ఇలా అనేక రకాల హార్డ్ వేర్ ఉత్పత్తులకు డీఫాల్ట్ పాస్ వర్డ్ లు అంటూ కొన్ని ఉంటాయి. అత్యవసర సమయంలో అవి ఉపయోగపడతాయి.
అవేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? http://artofhacking.com/etc/passwd.htm అనే సైట్ లోకి వెళ్లి మీకు కావలసిన కంపెనీ పేరుపై క్లిక్ చేస్తే ఆ కంపెనీ ఉత్పత్తి చేసే వివిధ ఉత్పత్తుల వివరాలు, వాటి వెర్షన్లు, డీఫాల్ట్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ల వివరాలు పై చిత్రంలో విధంగా చూపించబడుతూ ఉంటాయి. మీరు వాడే ఉత్పత్తుల డీఫాల్ట్ పాస్ వర్డ్ లు ఎక్కడైనా రాసి పెట్టుకోవడం ఉత్తమం.
Không có nhận xét nào:
Đăng nhận xét