- Cell Phone సమస్యలు
మీకు ఉన్నట్టుండి వింతవింత శబ్దాలు వినిపిస్తున్నాయా? మీ చెవిలో ఏదో శబ్దం మారుమోగుతోందా?
మీ చెవి వేడెక్కినట్లు అనిపిస్తోందా..? ఇవన్నీ మీరు చేసిన ఓ పనివల్ల వచ్చినవే. అదే సెల్‌ఫోన్‌లో మాట్లాడడం.. మీరు నమ్మినా నమ్మకపోయినా.. అదే పచ్చినిజం. కేవలం సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడడం వల్ల మీరు వినికిడి సమస్యలను ఎదుర్కోనున్నారు..
- ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు
మీరు సెల్‌ఫోన్ ఎక్కువగా వాడతారా..? రోజుకు 20 - 30 కాల్స్ చేస్తుంటారా? ఎంత లేదన్నా రోజుకు ఓ అరగంట మాట్లాడతారా..? అయితే.. మీకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ? అతి తక్కువ కాలంలో మీ ప్రాణం పోవచ్చు..?
ఈ విషయం మేం చెబుతున్నది కాదు.. ఈ హెచ్చరిక చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ - W.H.O.
సెల్‌ఫోన్ వల్ల వచ్చే సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రావడంతో.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ సమస్యపై దృష్టి పెట్టింది W.H.O. అప్పటినుంచి చేస్తున్న పరిశోధనల ఫలితాలు.. ఇప్పుడు విడుదలయ్యాయి. ఆ ఫలితాలే సెల్ వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి.
రోజుకు అరగంట సెల్‌ఫోన్‌లో కబుర్లు చెప్పేవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని.. WHO రిపోర్ట్ చెబుతోంది. పైగా.. సెల్‌ఫోన్ వాడని వారితో పోల్చితే సెల్ వాడేవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువని రిపోర్ట్ పేర్కొంది. దాదాపు పదమూడు దేశాల్లో.. పదేళ్ల పాటు ఈ పరిశోధన సాగింది. 5 వేలమంది బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్స్‌పైనా, వారి సన్నిహితులపైనా పరిశోధన జరిగింది. వీరిలో ఎక్కువమందికి ఫోన్ ఎక్కువగా ఉపయోగించే చెవి వైపునే ట్యూమర్స్ ఏర్పడ్డాయి. దీన్నిబట్టి.. సెల్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలే ఎక్కువే అంటోంది WHO.
పరిష్కారమార్గం
సెల్ వాడకాన్ని తగ్గించడం కష్టమే.. పైగా.. రోజురోజుకూ సెల్‌ను వాడేవారి సంఖ్య పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే.. మొబైల్ వాడే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే... ప్రాణానికే ప్రమాదం. ముఖ్యంగా.. సెల్‌ఫోన్‌ను చెవికి దగ్గరగా పెట్టి మాట్లాడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దానివల్లే సమస్యలు ఎక్కువవుతాయి.
ఇప్పటికే సమస్యలతో బాధపడుతున్నవారు సెల్‌ఫోన్‌లో వీలైనంత తక్కువ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సెల్‌లో సొల్లు కబుర్లు చెప్పుకోకుండా.. సింపుల్‌గా కాల్ ముగించాలి.
కంటిన్యూగా మాట్లాడడం అలవాటైన జనానికి.. ప్రతీసారి లోబ్యాటరీ వెక్కిరిస్తూ ఉంటుంది. అయినా సెల్లు బాబులు మాత్రం దాన్ని వదలిపెట్టారు. కానీ.. ఈ సమయంలోనే రేడియేషన్ చాలా ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి.. లో బ్యాటరీ వచ్చిందంటే.. సెల్లు చెల్లు చెప్పాలి. ఫుల్‌ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాతే మళ్లీ కాల్స్ అటెండ్ చేయాలి. అప్పుడే మీ చెవి సురక్షితంగా ఉంటుంది. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేదంటే.. సెల్లు కారణంగా హాస్పిటల్ బిల్లు పెంచుకోవాల్సి ఉంటుంది.
- సెల్'ఫోనును కనీసం 23 సెంటీమీటర్ల దూరంలో ఉంచి వాడాలి , నిద్రపోతున్నప్పుడు దిండు కింద లేదా పక్కన పెట్టుకోవడం మంచిది కాదు
- బస్సులోనో, స్కూటరులోనో ప్రయాణించేటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. బలహీన నెట్'వర్క్ కారణంగా ఎక్కువ తీవ్రతతో రేడియేషన్ కలుగుతుంది.
- అండర్'గ్రౌండ్స్, లిఫ్టులు, క్లోజ్'డ్ భవంతులలో వాడినా ఇదే సమస్య తలెత్తుతుంది.
- కాల్'ను వీలయినంత త్వరగా ముగించాలి. 6 నిమిషాల వ్యవధిలోపు కాల్'ను ముగిస్తే మంచిది.
- కాల్'కు కాల్'కు మధ్య కనీసం 10 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
- చెవులకు ఏదైనా లోహపు వస్తువులు ధరించి ఉన్నట్లయితే.. కాల్ మాట్లాడిన తర్వాత కూడా రేడియేషన్ ప్రభావం కాసేపు ఉంటుంది.
- బ్లూ టూత్'ను వినియోగించాలి, యాంటీ రేడియేషన్ చిప్స్'ను ఫోనుకు అతికించుకోవాలి
- మార్కెట్'లో లభించే రేడియేషన్ ఫిల్టర్ కార్డును వినియోగిస్తే మంచిది.
- 15 ఏళ్లలోపు పిల్లలకు సెల్'ఫోనును దూరంగా ఉంచడమే మేలు.
- గర్భిణిలు ఫోనును అస్సలు వినియోగించకూడదు. అతిగా వాడితే బుద్ధిహీన పిల్లలు పుట్టే ప్రమాదముంది.
- వృద్ధులు సెల్'ఫోనును తక్కువగా వాడాలి.
- బహిరంగ స్థలాల్లో, 10 మంది మధ్య వ్యక్తిగత విషయాలను బిగ్గరగా మాట్లాడరాదు. కనీసం ఓ 10 అడుగుల దూరానికి పోయి అవతలి వ్యక్తికి వినబడే స్థాయిలోనే సెల్‌ఫోన్‌లో మాట్లాడాలి.
- టీనేజ్ పిల్లలకు సెల్‌ఫోన్ వెసులబాటు కల్పిస్తే వారి జీవితాన్ని సగం పాళ్లు నాశనం చేసేసినట్లేనని పెద్దలు గుర్తించాలి.
- వాహనంపై వెళ్లు మరీ అంత అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌లో మాటాడాల్సి వస్తే వాహనాన్ని నిలిపి మాట్లాడాలి.
- అధికార, అనధికార సమావేశాల్లో పాల్గోనెటప్పుడు, రెస్టారెంట్లలోనూ, లైబ్రరీలలోనూ, సెమినార్‌లలోనే తప్పనిసరిగా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, వైబ్రేషన్‌లో ఉంచాలి.అవసరమనుకున్నప్పుడే సెల్‌ఫోన్‌ను వినియోగించాలి.
- కాలక్షేపం కోసం వినియోగించరాదు. సాధ్యమైనంత వరకు సెల్ వినియోగాన్ని తగ్గించే యత్నాన్ని అందరూ చేయాలి. గంటల తరబడి సెల్‌ఫోన్‌ను వినియోగించడం ఆరోగ్య రీత్యా హానికరమంటూ పలువురు హెచ్చరిస్తూనే ఉన్నారు.
- సమావేశాల్లో సెల్‌ఫోన్‌కు సమాధానం ఇవ్వాల్సి వస్తే విధిగా సాటి సభ్యుల అనుమతి తీసుకుని బయటకు వెళ్లి మాట్లాడటం మర్యాదగా ఉంటుంది.
- ప్రయాణసమయాలలో, 10 మంది ఉన్నప్పుడు కాల్ వస్తే వ్యక్తిగత విషయాలను ఫోన్‌ద్వారా బహిరంగ పర్చుకోరాదు. సమధానాన్ని యివ్వాల్సి వస్తే ఎస్.ఎమ్.ఎస్ చేయడం మంచిది.
- కోర్టుల్లోనే, గ్రంధాలయాల్లోనూ, ప్రార్థనా స్థలాల్లోనూ చనిపోయిన వారిని పరామర్శించేందుకో, చూసేందుకో వెళ్లే సమయాల్లోనూ విధిగా ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి ఉంచాలి.
- అనుకోకుండా తలనొప్పి రావడం.. రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం.. నరాల సమస్య.. ఇలా ఒకదాని వెంట మరొకటి చుట్టుముడతాయి. దీనికి కారణం కేవలం మీరు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్. చివరకు.. సెక్స్‌సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి సెల్‌ఫోన్లు..
- . సెల్ అతిగా వాడే స్త్రీలకు అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డాక్టర్లు కూడా వీలైనంతవరకూ గర్భిణీలు సెల్‌ఫోన్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
- ఇక మానసిక సమస్యల ప్రభావం సెల్‌ఫోన్ల వాడకం వల్ల చాలా పెరుగుతోంది. సెల్ సంస్కృతి విస్తరించిన తర్వాత మానవ సంబంధాలు తగ్గుముఖం పట్టాయి.
- ఏ పనైనా సెల్ ద్వారానే జరుగుతోంది. మనిషీ, మనిషీ కలుసుకునే సమయం తగ్గిపోతోంది. ఇక చేతిలో సెల్ ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోతున్నారు ఈ తరం యువతీయువకులు. సెల్ ద్వారా అనవసర పరిచయాలు పెంచుకుంటున్నారు. చివరకు జీవితాలనూ నాశనం చేసుకుంటున్నారు.
Không có nhận xét nào:
Đăng nhận xét