హాయ్ visitors ,
పేపాల్ గురించి మీకు తెలుసు కదా..మీరో నెట్ లో వస్తు కొంటె డబ్బు చెల్లించడానికి క్రెడిట్ కార్డు తో పాటు మీకు paypal ఆప్షన్ కూడా కనబడుతుంది.క్రెడిట్ కార్డు ఉండగా మల్లి paypal ఎందుకు అనే సందేహం వస్తే చెప్తాను ఎందుకూ అది అని...క్రెడిట్ కార్డు అయితే మీ లావాదేవీ చేసినప్పుడు మీ కార్డు details అనీ మీకు కొన్న మర్చెంట్ కు తెలిసే అవకాశాలు ఎక్కువ..అదే paypal విదానం లో మీకు వస్తువు అమ్మే విక్రయదారునికి మద్య paypal ఉండి మీ లావాదేవి లు సురక్షితంగ జరిగేల చూస్తుంది..అందుకే paypal Account.
Requirements : Bank Account,PAN Card,NEFT Code
Procedure: ఇప్పుడు మీ బ్రౌజరు లో కి లాగిన్ అయ్యి paypal.com లో కి లాగిన్ అవండి. 1.లాగిన్.(Login). 2.సైన్అప్(SignUp) అనే రెండు ఆప్షన్ లు కనిపిస్తే.. సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఒక ఫారం కనిపిస్తుంది..చాల మామూలు డీటైల్స్ ఉంటాయి మీ గురించి.
Note: ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ పేరు నింపేటప్పుడు మీ బ్యాంకు ఎకౌంటు లో ఏ పేరు అయితే ఉన్నదో అదే పేరు తో ఇక్కడ paypal లో కుడా అదే పేరు తో ఎకౌంటు తయారు చేయండి లేకుంటే తర్వాత ఇబ్బంది.మీ Email కి ఈ Details అన్ని పంపబడతాయి అందుకే Email_ID ని జాగ్రతగా ఉంచుకోండి.
నెట్ ద్వారా ఆదాయం సంపాదించాలనుకుంటే ఆన్‌లైన్ అకౌంట్ (Online Account) కలిగి ఉండడం తప్పనిసరి. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ కాకుండా కేవలం ఇందుకోసమే ఉపయోగపడే 'పేపాల్'లాంటి వాటిలో సభ్యులవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 944 లక్షల మంది పేపాల్ ఎకౌంట్‌ను వాడుతున్నారు. పేపాల్‌తో పాటు మరికొన్ని అకౌంట్స్ కూడా ఉన్నాయి.
PayPal: is the faster, safer way to send money, make an online payment, receive money or set up a merchant accountపేపాల్ ఎకౌంట్‌లో సభ్యత్వం ఎలా
1.సైట్‌లోకి (www.paypal.com) వెళ్లి 'సైన్‌అప్' (Sign Up) పై క్లిక్ చేస్తే a) పర్సనల్(Personal), b) బిజినెస్(Business) అనే 2 విభాగాలు కనిపిస్తాయి. మీ అవసరానికి తగ్గట్టు ఒకటి ఎంచుకోవాలి. ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేయడానికి బిజినెస్‌లు అవసరమవుతాయి.
2.పర్సనల్ అకౌంట్ ఉచితమైనా మిగతా రెండింటికీ కొంత ఛార్జ్ చేస్తారు. అకౌంట్‌కి ఎనిమిది కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉండేలా క్లిష్టమైన పాస్‌వర్డ్‌ని తయారు చేయండి. రెండు వారాలకోసారి పాస్‌వర్డ్‌ని మార్చేయండి. రిజిస్ట్రేషన్‌లో భాగంగా భారత ప్రభుత్వ రిజర్వు బ్యాంక్ గైడ్‌లైన్స్ ప్రకారం పాన్ నెంబర్, పుట్టిన రోజు వివరాలు నమోదు చేయాలి. వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసేప్పుడు సైట్ సురక్షితమో కాదో తెలుసుకోవాలి. అందుకు అడ్రస్‌బార్‌లో వెబ్‌సైట్ ప్రారంభానికి ముందు https:// ఉందో లేదో చూడండి. అలాగే అడ్రస్ బార్ చివర్లో తాళం గుర్తు ఉండాలి.
3.ఎకౌంట్ సెక్యూరిటీ కోసం మొబైల్ నెంబర్‌ని కూడా కోరతారు. చివరిగా క్రెడిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ కోసం వేచి చూడాలి. స్టేట్‌మెంట్‌లో 4 లేదా 5 అంకెల డిపాజిట్ కోడ్‌తో పే పాల్ అకౌంట్‌లో సుమారు 1.95 డాలర్ల ట్రాన్స్‌సాక్షన్ చేయమని వస్తుంది. అప్పుడు మీరు కోడ్‌ను ఎంటర్ చేసి 'వెరిఫై' (Verify) ట్యాబ్‌ను క్లిక్ చేస్తే Verified Congratulations అని వస్తుంది. దీంతో మీ ఎకౌంట్ క్రియేట్ అయినట్టే! ఆన్‌లైన్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా మరో క్రెడిట్ కార్డ్‌ని తీసుకుని అదే కార్డ్‌ని పేపాల్ అకౌంట్‌లో వాడడం ద్వారా ఎప్పటికప్పుడు సులభంగా మానిటర్ చేయవచ్చు. దీంతో నిశ్చింతగా మీరు ఈ-ఎర్నింగ్‌లో పేపాల్ వాడుకోవచ్చు.
Không có nhận xét nào:
Đăng nhận xét