నేడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సోషల్ నెటివర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్. ఈ సైట్‌ను 2004 ఫిబ్రవరిలో ప్రారంభించారు. దీన్ని ఫేస్‌బుక్ ఇన్‌కార్పోరేషన్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇక ఈ సైట్ మెంబర్స్ ఎవరినైనా ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు. వారికి మెస్సేజ్‌లు పంపిస్తూ వారితో ముచ్చటిం చవచ్చు. దీంతోపాటు ఈ సైట్లో తమ పర్సనల్ ఫ్రొఫైనల్స్‌ను పొందుపరచుకోవచ్చు. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ తమ స్నేహి తులకు సైతం వీటిని పంపించుకునే అవకాశం ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో ఉండడం విశేషం. ఈ సైట్ మెంబర్స్ తమ వర్క్‌ప్లేస్, స్కూల్, కాలేజీల పేరిట విడిగా నెట్‌వర్క్‌సను ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉండడం విశేషం. ఇక 13 సంవత్సరాలు ఆపైన వయస్సు ఉన్న వారెవరైనా ఫేస్‌బుక్‌లో సులభంగా చేరవచ్చు.
ఇంటర్నెట్‌లో వినూత్నంగా… ఫేస్‌బుక్ ను మార్క్ జుకెర్‌బర్గ్ (Mark Elliot Zuckerberg) అనే వ్యక్తి మొదట కనుక్కొన్నారు. ఆయన తన కాలేజీ రూమ్‌మేట్స్ అయిన సైన్స్ స్టూడెంట్స్ ఎడ్యువర్డొ సవెరిన్, డస్టిన్ మొస్కొవిట్జ్, క్రిస్ హగ్స్‌తో కలిసి దీన్ని ప్రారం భించారు. మొదట ఈ వెబ్‌సైట్‌లో మెంబర్‌షిప్‌ను ఫౌండర్స్‌తో పాటు హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెం ట్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. అనంతరం బోస్టన్ ప్రాంతంలోని వివిధ కాలేజీ విద్యార్థులు, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి సైట్‌ను విస్తరించారు. ఆ తర్వాత ప్రపం చంలోని అన్ని యూనివర్సిటీలు, స్కూళ్ల విద్యార్థులు ఈ సైట్‌లో చేరేందుకు అవకాశం కల్పించారు. చివరగా 13 సంవత్సరాలు ఆపైన వయస్సు గల వారెవరైనా ఫేస్‌బుక్‌లో చేరవచ్చని నియమ,నిబంధనలను విధించారు. ఫేస్‌బుక్ ప్రారంభమైన మొదట్లో దాని కాన్సెప్ట్ కేవలం విద్యార్థులకు ఉపయో గకరంగా ఉండేవిధంగా ఉండేది.
1.Face book లుక్స్(LOOKS): ఏ వెబ్‌సైటు కయినా ప్రాణం లుక్స్ అది కనిపించే తీరు. వాడుకదారులకి వివిధ అభిరుచులున్నా ఒక అంచనా వేస్తే చాలా మందికి సింపుల్‌గా ఉండే డిజైన్లు నప్పుతాయి. క్లంజీగా(clumsy) తయారయిన వెబ్‌సైట్లు వాడుకదార్లని వెంటనే తిరిగి వెళ్ళిపోయేలా చేస్తాయి.
5.చాట్(Chat): అలాగే మీ ఫేస్‌బుక్ స్నేహితులతో సంభాషించేందుకు వీలుగా చాట్ విధానం ఉంది. జీ టాక్ (Gtalk)దా యాహూ మెసెంజరులో(YM) మీ స్నేహితులతో సంభాషించినట్టే మీరు ఫేస్‌బుక్ ద్వారా కూడా వారితో సంభాషించవచ్చు.
6.Photos(ఫోటోలు),Videos(వీడియోలు): ఫేస్‌బుక్ తన వెబ్‌సైటులోనే అంతర్గతంగా ఫోటోలు, వీడియోలూ భద్రపరచుకునే సౌకర్యం కల్పించింది. అలాగే వీడియోలు ఫేస్‌బుక్ లోకే ఎగుమతించి లేదా యూట్యూబు వంటి వాటికి Linkనిచ్చి ఇతరులతో పంచుకోవచ్చు.
Facebook ఎందుకు No.1 అయింది :
సోషల్ నెట్వర్కింగ్‌లో అన్నిటికన్నా ప్రాముఖ్యత సంపాదించుకున్నది మాత్రం ఫేస్‌బుక్. దాని అభివృద్ధి కొనసాగుతూనే ఉంది. ఎన్నో దేశాల నుంచి వాడుకదారులని సంపాదించుకుంటూనే ఉంది
1.Face book లుక్స్(LOOKS): ఏ వెబ్‌సైటు కయినా ప్రాణం లుక్స్ అది కనిపించే తీరు. వాడుకదారులకి వివిధ అభిరుచులున్నా ఒక అంచనా వేస్తే చాలా మందికి సింపుల్‌గా ఉండే డిజైన్లు నప్పుతాయి. క్లంజీగా(clumsy) తయారయిన వెబ్‌సైట్లు వాడుకదార్లని వెంటనే తిరిగి వెళ్ళిపోయేలా చేస్తాయి.
ఆ కోణంలో నుంచి చూస్తే ఫేస్‌బుక్ సరయిన మార్పులను చేసుకుంటూ ఎంతో చక్కటి డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. క్లీనుగా కంటికింపుగా ఉంటుంది. సరయిన ప్రమాణాలలో వార్తలని, స్నేహితుల నుంచి నవీకరణలని, నోటిఫికేషన్లనీ చూపిస్తుంది. ఎడం పక్క ఉండే నావిగేషన్లో చక్కగా అంశాల వారీగా సంగతులు విభజించబడి ఉంటాయి. మధ్యలో వార్తలు, కుడి పక్కన స్నేహితుల సజెషన్లూ, అడ్వరయిజ్‌మెంట్లూ వగయిరా ఉంటాయి. ఏ వివరాలు కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంటాయి.
2.Speed వేగం: ఒక వెబ్‌పేజీకి వేగంగా చూపగలగడం ఎంతో ముఖ్యం. పేజీ తాజీకరించాలంటే రిఫ్రెష్ చెయ్యనవసరం లేకుండా చేసే ప్రక్రియని చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు ఫేస్‌బుక్‌లో. అవసరమయిన వాటికి మాత్రమే వాడుకదార్లు వేచి ఉండేలా చూసారు. అదీ కాక తమ వెబ్‌సైటు అత్యంత వేగవంతంగా ఉండేందుకు పీహెచ్పీని సీ++ లోకి తర్జుమా చేసేలా "హిప్‌హాప్" అనే ప్రాజెక్టునే సృష్టించారు. అందువల్ల వెబ్‌సైటు ఎంతో వేగంగా సమాచారాన్ని అందిస్తుంది.
3.Face Book Language :(తెలుగు లో కూడా) :మీ భాషలో మీకు: పైవన్నీ కాక ఫేస్‌బుక్ మీ భాషలోనే లభ్యమవుతుంది. ఎన్నో ఇతర భాషలలోకి ఫేస్‌బుక్‌ని ఇప్పటికే స్థానికీకరించారు. తెలుగుతో పాటు ఎన్నో భారతీయ భాషలలో ఇప్పటికే లభ్యమవుతుంది. అలాగే మీ భాషలోకి మీరు స్థానికీకరించడానికి వెసులుబాటు కల్పించింది.చాలా మటుకు వాడుకదారుల సహాయంతో అభివృద్ధి సాధించింది.
4.సూచనలు(Notifications),: ఫేస్‌బుక్ పైన ఏ సంగతి జరిగినా అది వెంటనే తెలుసుకోవడానికి వీలుగా సూచనలు విధానాన్ని రూపొందించింది. మీరు ఒక వ్యాఖ్య వ్రాసినా, మీ వ్యాఖ్యకు ఎవరయినా బదులిచ్చినా, మీ ఫోటోల మీద కామెంటినా, ఒక టపా ప్రచురించినా అన్నీ మీకు వెంటనే తెలిసేలా నోటిఫికేషన్లని జారీ చేస్తుంది. అలాగే వివిధ అప్లికేషన్ల నుంచి కూడా మీకు నోటిఫికేషన్లు అందుతాయి. మీరు కూడా మీకు ఎవరెవరి నుంచి నోటిఫికేషన్లు అందాలో సర్దుబాటు చేసేందుకు కూడా విధివిధానాలు రూపొందించింది.
5.చాట్(Chat): అలాగే మీ ఫేస్‌బుక్ స్నేహితులతో సంభాషించేందుకు వీలుగా చాట్ విధానం ఉంది. జీ టాక్ (Gtalk)దా యాహూ మెసెంజరులో(YM) మీ స్నేహితులతో సంభాషించినట్టే మీరు ఫేస్‌బుక్ ద్వారా కూడా వారితో సంభాషించవచ్చు.
6.Photos(ఫోటోలు),Videos(వీడియోలు): ఫేస్‌బుక్ తన వెబ్‌సైటులోనే అంతర్గతంగా ఫోటోలు, వీడియోలూ భద్రపరచుకునే సౌకర్యం కల్పించింది. అలాగే వీడియోలు ఫేస్‌బుక్ లోకే ఎగుమతించి లేదా యూట్యూబు వంటి వాటికి Linkనిచ్చి ఇతరులతో పంచుకోవచ్చు.
7.స్నేహితులతో సంభాషణ: ఇతర విషయాలెలాగున్నా ఫేస్‌బుక్ ప్రముఖ ఉపయోగం స్నేహితులతోనూ, ఆసక్తికరమయినా వ్యక్తులతోనూ కనెక్ట్ కావడం. అందుకని ఇందులో మిమ్మల్ని మీ స్నేహితులతో అనుసంధానించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లనూ చాలా చక్కగా చేసింది. మీరు ఇందులో సభ్యులయిన వెంటనే మీ స్నేహితులని వెతికి పట్టుకోవడానికి జీమెయిలు, యాహూ వంటి వాటి నుండి మీ కాంటాక్టులని వెతికి పట్టుకుని వెంటనే జత చేసుకునేలా సదుపాయం కల్పించింది. అంతే కాక మీరు, మీ స్నేహితులని బట్టి ఎవరయితే మీ స్నేహితులయే ఆస్కారం ఉందో వారిని కుడివైపు చూపిస్తూ ఉంటుంది. అందువల్ల త్వరలోనే మీ పరిధి విస్తరించుకునేందుకు ఆస్కారం లభిస్తుంది. అలాగే వివిధ బ్రాండులని ప్రమోట్ చేసుకునేందుకు పేజీలూ, విద్యా సంస్థలూ, ఉద్యోగ సంస్థలూ సంభాషించుకునేందుకు వీలుగా గ్రూపులూ సృష్టించుకునే వెసులుబాటు కల్పించింది. అంతే కాక మీ స్నేహితులతో సంభషించడానికి వాల్, ప్రైవేటుగా మాట్లాడటానికి మెసేజస్ వంటి సదుపాయాలూ లభ్యం. అందువల్ల సంభాషణలకు వెసులుబాటు చాలా బాగుంటుంది.
8.Applications (అప్లికేషన్లు):అప్లికేషన్లు కూడా ఫేస్‌బుక్‌కి ఆయువుపట్టు వంటివి. ఫేస్‌బుక్ ఒక వెబ్‌సైటుగా అందించే సదుపాయాలు కొన్నయితే దానిని ఎక్స్టెండ్ చేసేందుకు, మెరుగు పరచేందుకు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారంను సృష్టించారు. ఇందువల్ల ఉపయోగమేమిటంటే ఈ వెబ్‌సైటుని వీడకుండాని జనాలు ఇంకెంతో చక్కని అనుభూతులు పొందేందుకు అమరిక చేయబడింది.
9.Games(ఆటలు) : ఎంతో మంది ఎన్నో రకాలయిన ఆటలని ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారం కోసం సృష్టించారు. వాటిని ఒకసారి ఆడటం మొదలుపెట్టిన వారెవరయినా సరే ఇట్టే అతుక్కుపోతారు. అవి ఆడటం కోసం ఫేస్‌బుక్‌కి తిరిగి వస్తూనే ఉంటారు. అందువల్ల సొంతంగా తమదవకపోయినా ఇతర అప్లికేషన్ల వల్ల ఫేస్‌బుక్ ఎంతో లాభం పొందుతుంది. ఇది వారి మాస్టర్ స్ట్రోక్.
Social Networking Sites ఎలా వాడాలి:
Internet లో ఉన్న సోషల్ నెట్వర్క్ సైట్స్ లలో మీకు నచ్చిన యే సైట్లలో అయినా మీరు జాయిన్ అవచ్చు. అంతా ఫ్రీగానే సభ్యులై పోవచ్చును కదా.. కనుక మీ మిత్రులూ, బంధువులూ ఎక్కువగా దేనిలో ఉన్నారో అందులోనే చేరండి. ఎందుకంటే.వారితో ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు ఒకే సైట్లో మిత్రులనీ, బంధువుల్నీ ఏకకాలములో కలవవచ్చును. అలా చెయ్యటం వల్ల చాలా సమయం కలసివస్తుంది.
ఇక్కడ మీకో సూచన చేయ్యబోతున్నాను. యే సైటులో చేరిననూ - ఆ సైటు మీ పర్సనల్ విషయాలను కాపాడాలి. మళ్ళీ అందరిలో ఉన్నట్లు ఉండాలి. మీ వీడియోలను గానీ, మీ ఫొటోస్ లని గానీ, మీ పర్సనల్ స్క్రాప్స్ - ఈ మూడూ ఇతరుల కంట పడకుండా - అంటే - మీ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ లతో చూస్తేనే కనిపించే-యే సైట్ అయినా ఓకే. బంధువులకి, మిత్రులకి ఫొటోస్ షేరింగ్ లో పెట్టినా అది వారికే కనిపించేలా, ఎప్పడు పడితే అప్పడు మార్చుకోగలిగే షేరింగ్ సెట్టింగ్స్ ఉండే సైటు మంచిది
Note:మీరు యే సోషల్ సైటులోకి వెళ్లి సభ్యత్వం పొందినా, గమనించాల్సిన విషయం ఏమిటంటే - మీ పర్సనల్ సీక్రెట్స్ అందులో పెట్టినా, ఇతరుల కంట కనపడకుండా ఉండేలా సెట్టింగ్స్ ఎప్పటికప్పుడు మార్చుకునేలా సెట్టింగ్స్ ఉండే సైటు చాలా బెస్ట్. అలాంటివాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీ మిత్రులనీ, మీ ఇతర బంధువుల్నీ అడిగి మరీ చూసి అందులోకి సభ్యత్వం పొందండి.
ఇప్పుడు మనం నచ్చిన ఒక సోషల్ నెట్వర్కింగ్ సైటులో చేరతాము. ఆ సైటు అడ్రెస్ లోకి వెళ్లి, క్రొత్త ఎకౌంటు ప్రారంభించేందుకు కావలసిన ఒక అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది. మీరు దాన్ని నింపండి. వారి వారి మెయిల్ ఐడీ, స్త్రీలా, పురుషులా, ఏ దేశమూ.. ఇలా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని పూరించండి.
ఇప్పుడు మీరు ఒక సెక్యూరిటీ ప్రశ్నలని ఎదురుక్కుంటారు. మీ అకౌంట్ కి అది రక్షణ గా ఉంటుంది. మీ మోటార్ వెహికిల్ పేరు, మీ చిన్నప్పటి స్కూల్ టీచర్ పేరు... ఇలా ఉంటుంది. ఇందులో సమాధానం నింపిన సమాధానాన్ని మీకు మాత్రమే తెలిసి ఉండాలి. ఆ విషయాన్ని చాట్లో కానీ, మీ మెయిల్ బాక్స్ లో గానీ, స్క్రాప్స్ లలో దాచుకోవద్దు. అలా చేస్తే మీరే ప్రమాదం లో పడతారు. ఆ అకౌంట్ ఇక మీ చేతిలోనుండి జారిపోయినట్లే!.
ఇలా ఇది ఎందుకు ఉంటుంది అంటే - రేపు మీ అక్కౌంట్ హాక్ అయినా, మీ పాస్ వర్డ్ ఎవరైనా తెలుసుకొని, మీ అక్కౌంట్ మైంటైన్ చేస్తున్నా, పాస్ వర్డ్ మార్చి మీ అక్కౌంట్ మైంటైన్ చేస్తున్నా - అప్పుడు ఇది చాలా ఉపయోగం, కీలకం కూడా. ఇది ఎలా అంటే - మీ అక్కౌంట్ ని పాస్ వర్డ్ మార్చి, వేరేవారు వాడుతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఆ సైటు వారికి పాస్వర్డ్ మరిచాను అని చెప్పి, లాగౌట్ అవ్వాలి. కాసేపటి తరవాత ఆ సైటులోకి లాగిన్ అయినప్పుడు - మీకు ఈ ప్రశ్న అడుగుతుంది. మీరు అప్పుడు పోస్ట్ చేసిన సమాధానం పోస్ట్ చెయ్యాలి. అప్పుడు ఆ సైటు ఓపెన్ అవుతుంది. వెంటనే పాస్వర్డ్ మార్చుకొని - ఇక నుండీ జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్కటి ఇతరులకి చెప్పారో - ఇక మీ అక్కౌంట్ ఇతరుల చేతికి చిక్కినట్లే.. మీరు చిక్కుల్లో పడ్డట్లే!..
Không có nhận xét nào:
Đăng nhận xét