Thứ Ba, 30 tháng 4, 2013

స్కిల్స్ పెంచుకుంటే లక్ష్య సాధన సులువే

కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలన్నా... జాబ్‌మార్కెట్‌లో పోటీని తట్టుకుని మంచి కొలువు సాధించాలన్నా... నిర్దేశిత లక్ష్యాలు తప్పనిసరి. వాటిని చేరుకునే క్రమంలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. అప్పుడే ఏ రోజు అంశాలను ఆ రోజే చదవడం, పరీక్షలు, ప్రాక్టికల్స్‌ల్లో గతంలో కంటే మెరుగైన ప్రతిభ ప్రదర్శించడానికి వీలవుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఏయే స్కిల్స్‌ను అలవర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం!!

రమేశ్, భరద్వాజ్... కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వారి భవిష్యత్ ప్రణాళికల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు.
రమేశ్: కోర్సు పూర్తయ్యాక ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చేరాలనుకుంటున్నాను.

భరద్వాజ్: నాకు నెట్‌వర్కింగ్ అంటే ఆసక్తి. నేను సిస్కోలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా చేరతాను. నేను మూడో సంవత్సరంలో ఉన్నప్పుడే రూటింగ్ అండ్ స్విచ్చింగ్‌లో సిస్కో సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేశాను.

ఇద్దరి మాటలను పరిశీలిస్తే ఎవరు భవిష్యత్ గురించి స్పష్టంగా ఉన్నారో అర్థమవుతుంది. భరద్వాజ్ ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా కోర్సునభ్యసిస్తున్న సమయంలోనే అవసరమైన స్కిల్స్‌ను పెంచుకునేందుకు సంబంధిత అంశాల్లో సర్టిఫికేషన్‌లు పూర్తి చేశాడు. ఇది కెరీర్ లక్ష్యాలను తెలుపుతుంది.

స్పష్టంగా ఉండడం:
ఇంజనీరింగ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. కొందరు లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ వాటిలో స్పష్టమైనవి, కచ్చితమైన లక్ష్యాలు ఉండడం లేదు. ఏయే అంశాలు చదవాలి. జాబ్ మార్కెట్‌కు ఏయే స్కిల్స్ అవసరం తదితర అంశాలపై అవగాహన ఉండాలి. అప్పుడే లక్ష్యంపై స్పష్టత ఏర్పడుతుంది. దాని సాధన దిశగా విద్యార్థులు దూసుకెళ్లాలి.

పూర్తి బాధ్యతను స్వీకరించడం:
సాధారణంగా చాలా మంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టులను నిర్లక్ష్యం చేస్తుంటారు. సబ్జెక్టుల్లో తమకు పట్టు లేదనే భావనతో కొందరు, కఠినమైన సబ్జెక్టులనే భయంతో మరికొందరు వాటిపై అంతగా దృష్టిసారించరు. ఇది సరైన పద్ధతి కాదు. పూర్తి కోర్సులో మంచి మార్కుల శాతాన్ని సాధించాలంటే అన్ని సబ్జెక్టుల్లో ప్రతిభ అవసరం. కాబట్టి కఠినమైన సబ్జెక్టుల ప్రాథమిక సమాచారాన్ని సేకరించండి. వాటిపై లోతైన అధ్యయనం చేయాలి. గత ఫలితాల గురించి ఆలోచిస్తూ అనవసర ఆందోళనలకు తావివ్వొద్దు. అన్ని సబ్జెక్టులను చదవాలనే బాధ్యతను స్వీకరించాలి... మంచి ఫలితాలు వాటంతట అవే సాధ్యమవుతాయి.

తెలివిగా పనిచేయడం:
తెలివిగా పనిచేయడం అంటే? తలపెట్టిన పనిని పూర్తిచేయడానికి శాయశక్తులా కృషిచేయడమే. తెలియని అంశాలను వదిలిపెట్టకుండా అందుకు సంబంధించిన సమాచారాన్ని శోధించాలి. వాటి గురించి పూర్తి అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కేవలం ఫలితాల కోసమే చదవకుండా సబ్జెక్టులపై పట్టు సాధించాలి!!

పరీక్షల్లో పాస్ మార్కులు సాధించేందుకు చాలామంది ఆల్ ఇన్ వన్‌లు, గైడ్స్‌ను ఆశ్రయిస్తుంటారు. వాటి ద్వారా తాత్కాలిక ప్రయోజనాలు సాధ్యమైనా దీర్ఘకాలంలో అంతగా ఉపయోగపడవనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. సబ్జెక్టుపై భావాత్మక పరిజ్ఞానం లేకుంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. ప్రామాణిక బుక్స్, రిఫరెన్స్ బుక్స్‌తోనే సబ్జెక్టుపై విస్తృత పరిజ్ఞానం సాధ్యమవుతుంది.
సబ్జెక్టుకు సంబంధించిన సందేహాల నివృత్తికి రోజుకు కనీసం అరగంట ఇంటర్నెట్‌నుపయోగించడం మంచి అలవాటు. దాని ద్వారా విద్యార్థులు చదువుతున్న బ్రాంచికి సంబంధించిన తాజా ఆవిష్కరణలు, సరికొత్త అంశాల గురించి తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు ఇది ప్రధానం.

ఇంటర్నెట్‌లో అందుబాటులోఉన్న అనేక ఆన్‌లైన్ వీడియో లెక్చర్స్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు సబ్జెక్టుపై పట్టు పెంచుకోవచ్చు. ఉదాహరణకు ఎన్‌పీటీఈఎల్... నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ వెబ్‌సైట్‌లో లభించే ఐఐటీ, ఐఐఎస్సీ ప్రొఫెసర్ల వీడియో లెక్చర్స్ ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందొచ్చు. వీటితోపాటు యూట్యూబ్‌లో ఎన్నో రకాల వీడియో పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. క్లాస్‌లో మిస్సయిన అంశాలను ఆన్‌లైన్‌లో నే నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వికీపీడియాలో కూడా విస్తృత సమాచారం అందుబాటులో ఉంది.

లక్ష్య సాధన దిశగా:
మేనేజ్‌మెంట్ రీసెర్చర్, లూథర్ గులిక్ చెప్పిన ్కైఈఇైఖఆ: ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డెరైక్టింగ్, కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్ అండ్ బడ్జెటింగ్‌ను విద్యార్థుల కోసం కింది విధంగా మార్చితే...
* P – Planning our target.
* O – Organizing the steps required to achieve the target
* S – Selecting the proper institute that will help to achieve target
* D – Directing all the efforts to finish activities, necessary to achieve the objective .
* CO – Coordinate daily activities efficiently and effectively,
* R – Recording daily progress, ( at least before going to bed)
* B – Budgeting your expenses which may include staying separately (especially in pre-final and final years of the course), attend coaching for useful extra certificate courses, (For Ex: for Civil Engg students.. AUTOCAD, ARCHICAD, PRIMAVERA, STADDPRO, For CSE students: CISCO, MS, ORACLE courses etc.) cost of applications and start working for the target.

సెల్ఫ్ కాన్ఫిడెన్స్:
విజయసాధనకు కావాల్సిన ముఖ్య లక్షణాల్లో ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యం. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకున్న వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారని చాలామంది భావిస్తారు. నిజానికి వారు తలపెట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో నిర్వర్తించినందుకే సఫలీకృతులయ్యారనడంలో సందేహం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సిలబస్‌ను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అన్ని సబ్జెక్టులపై దృష్టిసారించాలి. వాటిపై పట్టు పెంచుకునేందకు ప్రయత్నించాలి. అప్పుడే ఇంజనీర్‌గా విజయాలను సాధిస్తారు.

...............

కమ్యూనికేషన్ స్కిల్స్

పదేళ్ల క్రితం వరకూ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పదం పెద్దగా ప్రాచుర్యంలో లేదు. ప్రస్తుతం దీనికి ఎనలేని ప్రాధాన్యం. జాబ్ ఇంటర్వ్యూల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే... ఇప్పుడు కంపెనీల్లో ఒంటరిగా చేసే పని ఏదీలేదు. అంతా టీం వర్కే! అందుకే మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంటేనే టీంలో పనిచేస్తారన్నది కంపెనీల అభిప్రాయం.
కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనిస్, కమ్యూనికేర్ అనే లాటిన్ పదాల నుంచి ఏర్పడింది.

వాటి అర్థం పంచుకోవడం. సమాచారాన్ని పంచుకోవడం, ఆలోచనలు, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఇవన్నీ కమ్యూనికేషన్ కిందికే వస్తాయి. పైవాటిలో ఏ అంశంలో లోపమున్నా సరిగ్గా కమ్యూనికేట్ చేయడం సాధ్యపడదు. సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పకుండా మంచి సంబంధాలను ఏర్పరుస్తాయి. మరో విధంగా చెప్పాలంటే మన ప్రవర్తన, సామాజిక సంబంధాలు మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ప్రతిబింబిస్తాయి.

సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు, వింటున్న ప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనసు కమ్యూనికేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉంటుంది. మన కార్యకలాపాలను వ్యక్తపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఒక సమగ్ర కమ్యూనికేషన్‌లో వెర్బల్, నాన్ వెర్బల్ గుర్తులు, శబ్దాలు భాగంగా ఉంటాయి. కమ్యూనికేషన్ మన జీవితం, కెరీర్‌లో అంతర్భాగమైనందున స్పష్టమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి అవుతున్నాయి. వాటి ద్వారా వ్యక్తిగత ఆసక్తులను కూడా అర్థం చేసుకోవచ్చు.

కమ్యూనికేషన్‌లో ముఖ్యమైనది భాష. ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లిష్‌పై పట్టు తప్పనిసరి. ఒకరకంగా చెప్పాలంటే కమ్యూనికేషన్‌లో ఇంగ్లిష్ భాష బలమైన వారధిలా పనిచేస్తోంది. ఒక మంచి కమ్యూనికేటర్ మాత్రమే వెర్బల్, నాన్‌వెర్బల్, సాంకేతిక, మాస్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిస్థితులకు అనుగుణంగా ప్రయోగించగలడు. భాషతోపాటు విభిన్న రకాలుగా కూడా కమ్యూనికేట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు సంజ్ఞలు, ముఖ కవళికలు, చిత్రాలు... ఇవన్నీ కమ్యూనికేషన్ సాధనాలే.

కమ్యూనికేటివ్ విధానం ఆధారంగా భాషా ప్రావీణ్యాన్ని అంచనా వేయొచ్చు. కొందరు భాషపై పట్టు ఉన్నప్పటికీ కమ్యూనికేషన్‌లో విఫలమవుతుంటారు. అలాంటివారు కమ్యూనికేటివ్ విధానంపై కూడా అవగాహన పెంచుకోవాలి. నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు, వాక్యాలపై ఎక్కువ దృష్టి సారించాలి. జాబ్ ఇంటర్వ్యూల సమయంలో అది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇంగ్లిష్‌ను సరిగా మాట్లాడలేకపోతున్నామని భావించేవారు దానిపై పట్టు పెంచుకోవాలి.

ప్రయోజనాలు:
ఇంజనీరింగ్ అభ్యర్థులు అవకాశాలను అందిపుచ్చుకోవా లంటే అత్యుత్తమ సామర్థ్యాలు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి!

మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కళాశాలల్లోనూ, కంపెనీల్లోనూ అనేక మందితో మంచి నెట్‌వర్క్ ఏర్పడుతుంది. తద్వారా కెరీర్ అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

కమ్యూనికేషన్ స్కిల్స్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన, భావోద్వేగాలపరంగా సమతుల్యం ఏర్పడుతుంది.

ఇంటర్వ్యూల్లోనూ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రదర్శించడం ద్వారా ఇంటర్వ్యూర్‌ను ఆకట్టుకోవచ్చు.

ఇంజనీరింగ్ రంగాల్లో ప్రాజెక్టులకనుగుణంగా ప్రణాళికలను రూపొందించడం, వాటి గురించి సంస్థలకు సరిగ్గా కమ్యూనికేట్ చేయడం ప్రధానం. ప్రాజెక్టుల్లో ఎప్పటికప్పడు వస్తున్న మార్పులను బృందంలోని సభ్యులందరినీ సమన్వయ పర్చుకోవడానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమవుతాయి.

Thứ Hai, 29 tháng 4, 2013

వై-ఫై (Wi-Fi) అంటే…......

వైర్‌లెస్‌ ఫిడెలిటి(Wi-Fi),WIRELESS FIDELITY…ఇది రేడియో సంకేతాల ఆధారంగా పనిచేసే వైర్‌లెస్‌ టెక్నాలజీ. ఎలాంటి తీగలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేకుండా నెట్‌వర్క్‌ సౌకర్యాన్ని అందించే అద్భుతమిది. ఇందులో వైర్‌లెస్‌ యాక్సెస్‌ పాయింట్‌ (డబ్ల్యుఎపి)ది ప్రధాన పాత్ర. దీనినే రౌటర్‌(Router) అని కూడా పిలుస్తారు. ఒక్క రౌటర్‌ ద్వారా ఇంట్లో వై-ఫై ఎనేబుల్డ్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని పొందవచ్చు. కంప్యూ టర్‌ను ఆన్‌ చేయగానే దానికి ఏర్పాటు చేసిన వైర్‌లెస్‌ ఎడాప్టర్‌ సమాచారం మొత్తాన్ని రేడియో సంకేతాలుగా మార్చి యాంటెన్నా ద్వారా గా ల్లోకి ప్రసారం చేస్తుంది.ఆ సంకేతాలను రౌటర్‌ సంబంధిత ఇంటర్‌నెట్‌ కనెక్షన్లకు అందచేస్తుంది. ఇదే ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతూ నెట్‌ నుంచి వచ్చిన సమాచారాన్ని రౌటర్‌ రేడియో సంకేతాల రూపంలో ఎడాప్టర్‌కు అందజేస్తే…ఎడాప్టర్‌ ఆ సమాచారాన్ని మనకు తెలియచేస్తుంది. 

Note: సమాచార రంగంలో వచ్చిన ఈ కొత్త విప్లవం ఇక్కట్లను కూడా తెచ్చి పెడుతోంది. అజాగ్రత్త వహిస్తే వ్యక్తిగత సమాచారాన్ని,ఇ-మెయిల్స్‌, కం ప్యూటర్‌లోని ప్రతీ సమాచారాన్ని ఎవరైనా తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది.
వై-ఫై (Wi-Fi) జాగ్రత్తలు :
1.వై-ఫై కనెక్షన్‌ను ఉపయోగించుకుంటున్నవాళ్లు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రౌటర్‌ను ఆన్‌ చేయగానే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ తెరపై కనిపించే నెట్‌వర్క్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తోనే కంప్యూటర్‌ వై-ఫై సంకేతాలను గుర్తించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల బయటి వ్యక్తులు మీ సంకేతాలను వాడుకునే అవకాశం ఉండదు
2. పాస్‌వర్డ్‌ను తరచూ మారుస్తుండాలి. పాస్‌వర్డ్‌లో అక్షరాలతోపాటు అంకెలు ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. ఇంటర్‌నెట్‌ను వినియోగించని సమయంలో రౌటర్‌ను తప్పనిసరిగా స్విచాఫ్‌ చేసి పెట్టాలి.
3.మీ నెట్‌వర్క్‌ను ఎవరైనా యాక్సెస్‌ చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే మీకు వై-ఫై కనెక్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన ఇంజనీరును సంప్రదించి యాక్టివిటి లాగ్‌ గురించి తెలుసుకోవాలి. యాక్సెస్‌ పాయింట్‌ వద్ద డైనమిక్‌ హోస్ట్‌ కంట్రోల్‌ ప్రొటోకాల్‌ ఫంక్షన్‌ను డిసేబుల్‌ చేసి ఐపి అడ్రస్‌ను మాన్యువల్‌గా ఇవ్వాలి.

4.నెట్‌వర్క్‌ యాక్సెస్‌కు, లోకల్‌ కంప్యూటర్లకు ఐపి అడ్రస్‌లను మాన్యువల్‌గా ఇస్తే ఇతరులు మీ నెట్‌వర్క్‌ను వినియోగిం చుకోవటం సాధ్యం కాదు. యాక్సెస్‌ సెట్టింగ్స్‌లో అక్షరాలతో రూపొందించిన పాస్‌ కీ (వైర్‌లెస్‌ ఎన్‌స్క్రిప్షన్‌ ప్రొటోకాల్‌) ఎప్పుడూ ఎనేబుల్‌ అయి ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వైర్‌లెస్‌ డివైస్‌ నుంచి నెట్‌ను వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా పాస్‌ కీ అవసరమవుతుంది. అపుడు బయటి వ్యక్తులు మీ కనెక్షన్‌ను ఉపయోగించుకోలేరు. తరచూ ఈ పాస్‌ కీని కూడా మారుస్తుండాలి. మీ సిస్టంకు ఈ సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే start->run->cmd లోకి వెళ్లి అక్కడ ipconfig/all అన్న కమాండ్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.
5.ఒకవేళ mac అడ్రస్‌ ఉంటే access settings->access control లోకి వెళ్లి  అడ్రస్‌ల ఆధారంగానే నెట్‌వర్క్‌ వాడుకునేలా నిబంధన ఏర్పాటు చేసుకోవచ్చు. సిస్టంలోని ఇంటర్‌నెట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయటం ద్వారా ఎంతమంది మీ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటున్నారన్నది కూడా తెలుసుకునే వీలుంది. ఇతరుల మీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోకుండా చూసుకోవాలంటే తరచూ ఇంటర్‌నెట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసిచూస్తుండాలి. దాంతోపాటు అడ్మిన్‌ పాస్‌వర్డ్‌లను కూడా తరచూ మారుస్తుండాలి.
 6. యూజర్‌నేం, పాస్‌వర్డ్‌ పెట్టుకోకుండా వై-ఫై కనెక్షన్‌ను ఉపయోగించుకుంటూ రౌటర్‌ను ఆన్‌ చేస్తే సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలా రౌటర్‌ ఆన్‌ చేయగానే యాభై నుంచి వంద మీటర్ల మేర వై-ఫై సదుపాయం ఉండి ఆన్‌చేసి ఉన్న అన్ని కంప్యూటర్లకు మీ నెట్‌వర్క్‌ అనుసంధానమవుతుంది. అపుడు బయటి వ్యక్తులు మీకు తెలియకుండానే మీ నెట్‌వర్క్‌ను దేనికోసమైనా వాడుకునే ప్రమాదం ఉంది.

7.మీ వైఫై నెట్‌వర్క్‌ను మీరు మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటే ఇన్‌స్టాలేషన్ సమయంలోనే దానికి ఒక సీక్రెట్ కోడ్ లేదా పాస్‌వర్డ్ ఇచ్చుకోవాలి. మీకు ఇంటర్నెట్ అవసరం ఏర్పడినప్పుడు.. వైఫై ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీ వద్ద ఉన్న వైఫై ఎనేబుల్డ్ ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ సీక్రెట్ కోడ్ లేదా పాస్‌వర్డ్ అడుగుతుంది. అప్పుడు ఆ కోడ్‌ను ఎంటర్ చేసి, ఓకే చేయగానే వైఫై నెట్‌వర్క్‌కు ఆయా పరికరాలు అనుసంధానం అవుతాయి.

వై-ఫై (Wi-Fi) సౌకర్యాలు:::
Wi-fi ఉపయోగించుకోగలిగితే ఒక్క బ్రాడ్‌బ్యాండ్(Broadband) కనెక్షన్‌తో మీ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ హ్యాండ్‌సెట్స్ అన్నిట్లోనూ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ సాధ్యమవుతుంది.   మీ డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు ఎవరైనా బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్ నుంచి కనెక్షన్ తీసుకుని, వైర్‌లెస్ ఎన్ రూటర్ ద్వారా మీ ఇంట్లోని ల్యాప్‌టాప్, ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్లలో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎన్ని వైఫై ఎనేబుల్డ్ పరికరాలనైనా ఉపయోగించుకోవచ్చు. నెలసరి బ్రాడ్‌బ్యాండ్ రెంటల్ ఒక కనెక్షన్‌కు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది.

రూటర్లలో రకాలెన్నో..
వైఫై రూటర్లలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా సెల్యులార్ కంపెనీలు ఇంటర్నెట్ సర్వీస్(బ్రాడ్‌బ్యాండ్)ను కూడా అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కనెక్షన్‌తోపాటుగా ఈ రూటర్‌ను కూడా అమర్చుతాయి. మరికొన్ని కంపెనీలు బయట మార్కెట్‌లో కొనుక్కోవాలని వినియోగదారులకు సూచిస్తాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో డి-లింక్(D-link), నెట్‌గేర్(NetGear), ఐబాల్(i-ball), సిస్కో(Cisco), బెల్కిన్(Belkin) తదితర కంపెనీలకు చెందిన రూటర్లు అందుబాటులో ఉన్నాయి. నాణ్యత, కంపెనీ ఇమేజ్‌ను బట్టి వైఫై రూటర్ల ధరలు రూ.1,350 నుంచి రూ.1,600 వరకు ఉన్నాయి. "అన్ని వైఫై రూటర్ల స్పీడ్ 150 ఎంబిపిఎస్ (మెగా బైట్స్ పర్ సెకన్) ఉంటుంది. ఒక్క సిస్కో రూటర్ స్పీడ్ మాత్రం 50 ఎంబిపిఎస్ ఉంటుంది.అయితే ధర కాస్త అధికమైనా వీటి వల్ల ఉపయోగం ఎక్కువగా ఉండడంతో చాలామంది వినియోగదారులు డి-లింక్, నెట్‌గేర్ తదితర కంపెనీలకు చెందిన వైఫై రూటర్లను కొనుగోలు చేస్తున్నారు.

వై-ఫై (Wi-Fi) సౌకర్యం లేకపోతే..?

ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న చాలా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కంప్యూటర్లలో వైఫై సదుపాయం ఇన్‌బిల్ట్‌గానే ఉంటోంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు ఈ వైఫై సదుపాయం లేకపోతే, వైఫై యుఎస్‌బి అడాప్టర్ (Wifi USB Adapter) ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు. ఈ రకం అడాప్టర్లు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోనే ఉన్నాయి. వీటి ధర కూడా ఎక్కువేమీ కాదు. ఒక్కో వైఫై యుఎస్‌బి అడాప్టర్ ధర రూ.750 వరకు ఉండొచ్చు. ఈ అడాప్టర్‌ను సిపియు వెనుక భాగంలో ఉండే యుఎస్‌బి ఫీమేల్ ప్లగ్‌లో అమర్చడం ద్వారా సదరు కంప్యూటర్‌ను వైఫై నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురావచ్చు.

How Can I Connect to WiFi on My Computer?

1.Click "Start." Type "devmgmt.msc" into the search bar. Press "Enter" to open Device Manager.

2.Expand "Network adapters." If there is no device with the words "WLAN," "Wi-Fi" or "Wireless LAN" in the name, your computer might not have a Wi-Fi card. Connect a USB wireless card to the computer and install the device to enable wireless capabilities on your PC.

3.Click "Start." Right-click "Network." Select "Properties" from the contextual menu to open "Network and Sharing Center..Choose "Change adapter settings" from the left pane. Click "Wireless Network Connection."
Click "Enable this network device" if the option appears in the toolbar.

4.Click the arrow icon on the taskbar to view all of the programs in the notification area. Click the Wireless Network Connection icon to view a list of available Wi-Fi connections.Select a wireless hot spot from the list. Click "Connect." Enter the network password into the appropriate field, if required, then click "OK." Launch a browser and navigate to a Web site to confirm the connection works.


Thứ Sáu, 26 tháng 4, 2013

వేసేవిలో కరెంటు బిల్లు తగ్గించుకోండిలా

మేమిద్దరం ఉద్యోగస్తులు. పొద్దున్న వెళ్తే రాత్రి ఇంటికి వస్తాం. ఇంట్లో చెప్పుకోదగ్గ ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా లేవు. కాని నెల అయ్యేసరికి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. కారణమేమిటాని చాలామంది మహిళలు ఆందోళన చెందుతూ ఉంటారు. బిల్‌ ఎక్కువగా రావడానికి ఇతర కారణాలు కూడా చాలా ఉంటాయి.  అవేమిటో ఇపుడు తెలుసుకుందామా!.ప్రతి నెల కరెంటు బిల్లు చూడగానే మనకు షాక్ కొట్టినట్లౌతుంటుంది. చాలాసార్లు కరెంటు బిల్లుపై ఇంట్లో వాదోపవాదాలు చెలరేగుతుంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఆలోచించేదేంటంటే తాము కరెంటు తక్కువగానే వాడుతున్నామే..అయినాకూడా బిల్లు ఎందుకింత వచ్చింది అని.

1. కరెంటు బిల్లు ఎక్కువగా రావడానికి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాతవి కావడం కూడా ఒక కారణం. ఎలక్ట్రానిక్‌ వస్తువులు పది సంవత్సరాలు పైబడిన వాటిని వెంటనే మార్చుకోవడమే మంచి పద్ధతి. తాతల కాలం నాటినుంచీ వాడుతున్న బల్బులకు 60 వాట్‌లు, ట్యూబ్‌లైట్లకు 36 వాట్‌ల కరెంటు అవసరం అవుతుంది. అదే కాంపాక్టు ఫ్లోరోసెంట్‌ ల్యాంపుల(సీఎఫ్‌ఎల్‌)కు 11-15 వాట్‌లు అయితే సరిపోతుంది.

2. ఫ్రిజ్‌ కింద బేస్‌మెంట్‌ సరిగా లేకపోతే కూడా  కరెంట్‌ అధికంగా కాలుతుంది. ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచకుండా అవసరమున్నపుడు కొద్దిగంటలు వేసుకుని ప్లగ్‌ తీసేసి పెట్టడం ద్వారా కూడా కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు.రిఫ్రిజిరేటర్‌ కాయిల్స్‌ను తరచుగా వ్యాక్యూమింగ్‌ చేయి స్తుండాలి. అలాగే ఎండ ఎక్కువగా పడనిచోట రిఫ్రిజిరేటర్‌ను పెట్టాలి. నేరుగా ఫ్రిజ్‌ మీద పడే ఎండ వల్ల ఫ్రిజ్‌కు అధిక కరెంటు అవసరమవుతుంది. స్థలాభావం వల్ల ఫ్రిజ్‌, ఓవెన్‌ పక్కపక్కన పెట్టాల్సి వస్తే రెండింటి మధ్య ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా అడ్డుగా ఏదైనా పెట్టాలి

3.వేసవికాలం, చలికాలాల్లో కిటికీలను కర్టెన్లు లేకుండా పూర్తిగా తెరిచిపెట్టకండి.  కిటికీలకు ఎపుడూ కర్టెన్లు వేసి పెట్టాలి. ఎండ ఎక్కువగా ఉన్నపుడు అధిక వేడి నేరుగా ఇంట్లోకి రాకుండా కర్టెన్లు అడ్డుకుంటాయి. వాతావరణం చల్లగా ఉన్నపుడు కేవలం మధ్యాహ్నాలు మాత్రమే కర్టెన్లు తీయడమో లేదా కిటికీలు తెరవడమో చేయాలి. ఇలా చేయడం వల్ల చలిగా ఉన్నపుడు వెచ్చదనంకోసం, వేడి వాతావరణంలో చల్లదనంకోసం అదనపు కరెంటును కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

4.వాషింగ్‌ మెషిన్‌ను ఉపయోగించే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాగే వాషింగ్‌ మెషిన్‌లో ఉండే వార్మ్‌/ కోల్డ్‌, హాట్‌/వార్మ్‌, హాట్‌/కోల్డ్‌ స్విచ్‌లలో వార్మ్‌/ కోల్డ్‌ను మాత్రమే ఉపయోగించడం వల్ల కరెంటును ఆదా చేయవచ్చు.వేడిగావున్న పదార్థాలు చల్లబడ్డ తర్వాత మాత్రమే వాటిని ఫ్రిజ్‌లో ఉంచండి. దీంతో విద్యుత్ వినియోగం తక్కువ మోతాదులో జరుగుతుంది.

5.మీ ఫ్రిజ్‌లో  ఆటోమాటిక్‌ ఢీఫ్రాస్ట్‌ ఉంటే సరిలేకుంటే, తరచుగా ఫ్రిజ్‌ను మాన్యువల్‌ డీఫ్రాస్ట్‌ చేస్తుండాలి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు మంచి కండిషన్‌లో పనిచేస్తే మీ నెలవారీ కరెంటు బిల్లులో చాలా మార్పులువస్తాయి.

6.తలుపులు, కిటికీలు తుడవడానికి ఖరీదైన క్లీనర్లకు బదులు వెనిగర్‌, గోరువెచ్చని నీళ్ల మిశ్రమాన్ని ఉపయోగించండి. ముఖ్యంగా పిల్లలు కంప్యూటర్‌, టి.వి. ఫాన్లు ఆఫ్‌ చేయకుండా వెళ్ళిపో తుంటారు. ఇందువల్ల కూడా కరెంటు బిల్లులు పెరిగిపోతుంటాయి. ఇలాంటి చిన్ననాటినుంచే నేర్పిస్తే కరెంటు ఖర్చు మరికాస్త తగ్గుతుంది. 

7.విద్యుద్వినియోగం తక్కువగా ఉండే ఉపకరణాలను మాత్రమే కొనండి. డబ్బు ఎక్కువ పెట్టాల్సి వస్తుందని వెనకాడకండి. ఆ మేరకు కరెంటు బిల్లు తగ్గుతుంది.రాత్రి పూట త్వరగా పడుకోవడం అలవాటు చేసుకుంటే, కొంత మేరకు విద్యుత్తును ఆదా చేయవచ్చును. ఒక యూనిట్‌ కరెంటు పొదుపు రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తితో సమానం. కరెంటు పొదుపునకు అనేక మార్గాలున్నా పాటించడానికి మనసు రావడం లేదు. చిన్న చిన్న మార్పులతో ఎంత కరెంటు ఆదా చేయోచ్చో చూడండి

8. కొత్తగా ఎల్‌ఈడీ దీపాలు వచ్చాయి. వీటికి ఒక వాట్‌ కరెంటు సరిపోతుంది. వీటిని బెడ్‌ ల్యాంప్‌లుగా 50 లక్షల పడక గదుల్లో వాడితే ఏటా 30 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చు. సాధారణ జెట్‌ పంపులు వాడితే రోజుకి 2.25 యూనిట్లు ఖర్చవుతుంది. అదే సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్లకు 1.25 యూనిట్లు సరిపోతుంది. చాలా ఇళ్లలో ఫ్యాన్లకు సాధారణ రెగ్యులేటర్‌లు ఉన్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్‌ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.


9.ఇంట్లోనుంచి బయటకు వెళ్లే ముందు స్విచ్చులు ఆఫ్‌ చేసి ఉన్నాయో లేదో గమనించాలి. లేకపోతే మీరు వచ్చేంతవరకు లైట్లు వెలుగుతూ, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. దీంతో కరెంటు బిల్లు ఎక్కువవుతుంది. హీటర్‌ను వాడేవారు పది నుంచి పదిహేను నిమిషాలు పెడితే చాలు. ఫ్రిజ్‌ను సూర్యరశ్శి తగిలే ప్రాంతంలో పెట్టకపోవడం మంచిది. ఫ్లోరోసెంట్‌ బల్బులను వాడటం ఉత్తమం. కరెంటు ఆదాచేయడం అనేది గృహిణి చేతిలోనే ఉంది.

10.ఇంట్లో నెలవారీ ఖర్చుల్లో కరెంటు బిల్లు కూడా ముఖ్యమైందే. పొదుపుగా వాడుకుంటూ కరెంటు ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. వేడి నీటి కోసం గీజర్లకు ప్రత్యామ్నాయంగా సోలార్‌ వాటర్‌ హీటర్‌ ఏర్పాటు చేసుకోవడం మేలు. వీటి వల్ల పర్యావరణానికి మేలు. విద్యుత్తు ఖర్చూ తగ్గుతుంది. మిక్సీ లేదా గ్రైండర్ వాడేటప్పుడు అన్ని రకాల పదార్థాలు సరిగావున్నాయా లేదా చూసుకుని వాడితే మంచిది. మళ్ళీ..మళ్ళీ మిక్సీలు, గ్రైండర్లు వాడే పని తప్పుతుంది. అలాగే టీవీ చూసినంతసేపు చూసి వెంటనే ఆఫ్ చేయండి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

బంగారం మదుపు మార్గాలు

బంగారం కొనాలంటేనే భయం వేస్తుంది. రోజు రోజుకు దీని ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ పదిగ్రాముల బంగారం రూ.18వేల చిల్లర ఉండేది. ఇప్పుడు రూ.20వేల వరకూ పలుకుతున్నది. ఇక పెళ్లిళ్ల సీజన్‌, పండగలప్పుడు దీనిధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు బంగారాన్ని సంపదకు ఒక చిహ్నంగా, హోదాకు గుర్తుగా భావించేవారు.

                                                ధనవంతులు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేసి, ఆభరణాలను చేయించుకుని, ఒంటినిండా నగలతో సమాజంలో గొప్పవ్యక్తులుగా చలామణి అయ్యేందుకు ఆసక్తి చూపేవారు. ఆ నగలతోనే సమాజంలోనే అత్యంత ధనవంతులుగా కీర్తిని గడించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్థిక సంక్షోభాల కారణంగా పెట్టుబడి దృష్టితో కొనుగోలు చేసేవారి సంఖ్య రానురాను పెరిగి పోతున్నది. అంతేకాక ఇప్పుడు కాంచనం రూ. 19వేలకు పైగా ధర పలకడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. 
బంగారం కొనుగోలు పెరిగేందుకు, వీటి ధరలు పెరిగేందుకు కొన్ని కారణాలున్నాయి. అవి ఏంటో గమనిద్దాం.


మార్కెట్‌ పతనమైనప్పుడు :మార్కెట్లు భారీగా పతనం అయినప్పుడల్లా ఈక్విటీల్లో పెట్టుబడిపెట్టే మదుపర్లు, సంరక్షత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటు న్నారు. మార్కెట్లో తగ్గుదలలు నమోదైనప్పుడల్లా బంగారం ధర పెరుగుతున్నది. సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారానికి పేరున్నప్పటికీ, క్రమం తప్పకుండా ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఇతర పథకాలతో పోలిస్తే బంగారానిది కాస్త వెనకబాటే. షేర్లు, లేదా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు డివిడెండు వచ్చేందుకు అవకాశం ఉంది. బాండ్లు, ఫిక్సెడ్‌ డిపాజిట్లలో మదుపు చేసినపుడు వడ్డీ రూపంలో క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంది. స్థిరాస్తిలో మదుపు చేయడం ద్వారా అద్దె రూపంలో ఆదాయం ఆర్జించడానికి సాధ్యమవుతుంది.

సంప్రదాయ నగలు, నాణేల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు అనుబంధంగా ఉండే ఖర్చులవల్ల తిరిగి అమ్మిన ప్పుడు పెద్దగా లాభం ఏమీ ఉండకపోవచ్చు. పైగా తరుగుదల భయం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా బంగారంలో మదుపు చేస్తూనే మన పెట్టుబడి వృద్ధి చెందాలి? పైగా క్రమం తప్పకుండా ఆదాయం రావాలి అని భావించే వారికి ఓ ప్రత్యా మ్నాయం ఉంది. బంగారాన్ని నిజంగా కొనాల్సిన అవసరం లేకుండానే అందులో మదుపు అవకాశం కల్పించేవి గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ఫండ్ల గురించి తెలిసిందే కదా! ఇందులో మన దగ్గరున్న సొమ్ము ఆధారంగా ఎంత వీలైతే అంత పెట్టుబడి పెట్టవచ్చు. మనం చేయాల్సింది ఏమిటంటే మనం కాంచనానికి కేటాయించాలనుకున్న మొత్తంలో కొంత భాగం లిక్విడ్‌ ఫండ్లకు కేటాయించడం ఉత్తమం


బంగారంపై మదుపుపెట్టటమంటే కమోడిటీ ఇన్వెస్ట్‌మెంటే. బంగారం మదుపు మార్గాల్లో అనేక సాధనాలుంటాయి. వీటిలో 03  మూడు రకాల మదుపు మార్గాలు ముఖ్యమైనవి.

1. గోల్డ్‌ ఎక్స్‌చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (గోల్డ్‌ ఇటిఎఫ్‌) 2. గోల్డ్‌ హార్వెస్ట్‌ స్కీం 3.మ్యూచువల్‌ ఫండ్‌ (పాక్షికంగా).

1.గోల్డ్‌  ఇటిఎఫ్‌(Gold  Exchange Traded Funds) లో మదుపు ఎలా :ప్రత్యేకించి దీనికి డీమాట్‌ ఖాతా(Demat Account) తెరవాలి. బంగారాన్ని భౌతికంగా దగ్గర అట్టేపెట్టుకుంటే అనేక రకాల రిస్కులు ఎదురవుతాయి. కాబట్టి గోల్డ్‌ ఇటిఎఫ్‌లో మదుపు చేస్తే లాభాలు సైతం గడించవచ్చు. ఈ పథకంకింద ప్రతీ గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. రోజువారీ మార్కెట్‌ ధర ప్రకారం బంగారం కొనడం, అమ్మడం జరుగుతూఉంటుంది. ఈ రకం మదుపులో మీరు బంగారాన్ని కేవలం కాగితంపైనే కొంటారు. ఆ బంగారం తెచ్చి మదుపు పెట్టటం ఉండదు. అనేక కంపెనీల గోల్డ్‌ ఇటిఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటికీ స్టాక్‌ బ్రోకర్లు ఉంటారు.
                           మీ వద్ద అందుబాటులో ఉన్న మదుపు మొత్తం గురించి వారికి చెబితే అనువైన కంపెనీ ఇటిఎఫ్‌ బుక్‌ చేస్తారు. మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌బిఐ, కోటక్‌, యుటిఐ వంటి అనేక కంపెనీల గోల్డ్‌ ఇటిఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టాక్‌ బ్రోకర్‌ ద్వారా అనువైన కంపెనీలో మీ వద్ద ఉన్న మొత్తాన్ని మదుపు పెట్టవచ్చు. నేరుగా బంగారాన్ని కొనాల్సిన అవసరంలేదని ముఖ్యంగా గమనించాలి. మీరు మదుపు పెట్టిన మొత్తంపై బంగారం మార్కెట్‌ ధరను బట్టి మీకు లాభనష్టాలు ఉంటాయి. మార్కెట్‌లో మీ గోల్డ్‌ యూనిట్‌లను అమ్మిపెట్టమని స్టాక్‌ బ్రోకర్‌ను ఎప్పుడైనా మీరు కోరవచ్చు. అప్పుడున్న మార్కెట్‌ ధర ప్రకారం మీకు లాభనష్టాలు ఉంటాయి.

                            బంగారాన్ని భౌతికంగా దగ్గర అట్టేపెట్టుకుంటే అనేక రకాల రిస్కులు ఎదురవుతాయి. ఆ బంగారాన్ని భద్రంగా చూసుకోవాలి. అందుకు మీరు గోల్డ్‌ లాకర్‌ తెరిస్తే చాలా ఖర్చవుతుంది. దగ్గరుంచుకుంటే ఏరకంగానైనా పోగొట్టు కునే ప్రమాదం ఉంటుంది. బంగారాన్ని నగల రూపంలోకి మార్చుకోవడానికి మజూరీ ఖర్చులు అవుతాయి. తరుగులు కూడా ఉంటాయి. కాబట్టి నేరుగా బంగారాన్ని దగ్గరపెట్టుకోవడం లాభసాటి కాదు కనుక మదుపు మార్గంగా పనికిరాదు. డీమాట్‌ ఖాతా పద్దతిలో మదుపు చేయడమే మంచిది కనుక గోల్డ్‌ ఇటిఎఫ్‌ మంచి మార్గం. 
Note:ఈ మార్గంలో రిస్క్‌ తప్పించుకోవడానికి బంగారం ధర తగ్గినప్పుడు కొని, ధరపెరుగుతున్న తరుణాన్ని కనిపెట్టి అమ్మివేయడం చేయాలని మదుపరులు గుర్తించుకోవాలి. దీని వల్ల మీపై పడే భారం అంతగా ఉండదు. నామమత్రపు బ్రోకరేజీ చార్జీలనే మీరు భరించాల్సి ఉంటుంది. 

2.గోల్డ్‌ హార్వెష్ట్‌ (Gold Harvest) పథకం:ఈ పథకాన్ని ఎంచుకున్న రోజున ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం కనీసం ఒక లాట్‌ (100గ్రాములు) బుక్‌ అవుతుంది. ఇది కూడా డీమాట్‌ ఫాంలో ఉంటుంది. స్టాక్‌ బ్రోకరూ ఉంటాడు. కనీస మదుపుగా రూ.15వేలు ముందుగా చెల్లించాలి. మీరు మదుపు పెట్టాలనుకున్న మొత్తంలో మిగతా ధనాన్ని 12, 24 లేదా 36 నెలల వాయిదాల్లో చెల్లించాలి. మీరు మదుపు చేయదలచిన మొత్తాన్ని రూ.15వేలు పెడుతున్నప్పుడు రాసుకోవాలి. 
                                                             మెట్యూరిటీ కాలం తరువాత మీకు కావల్సిన రూపంలో బంగారం కడ్డీల రూపంలో తీసుకోవడంగానీ, డీమాట్‌ రూపంలో కొనసాగించటంగానీ చేయవచ్చు. డీమాట్‌ ఖాతాలోని బంగారాన్ని కూడా ఎప్పుడైనా అమ్మేయవచ్చు. ఈ పథకంలో 24క్యారెట్ల బంగారాన్ని మదుపు తీసుకుంటారు. ఇందులో ఎప్పుడంటే అప్పుడు ధన లభ్యత (లిక్విడిటి) సదుపాయం ఉంది. అందుకు కొన్ని నామమాత్రపు చార్చీలు చెల్లించాలి. ఇందులో బంగారం తరుగు మైనస్‌ చేసే ప్రసక్తిలేదు. ఈ పథకంలోకి చెల్లింపులకు పోస్ట్‌డేటెడ్‌ చెక్కులనే స్వీకరిస్తారు. ఈ పథకాన్ని బిర్లా సన్‌లైట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వారు తమ అపోలో సింధూరి కమోడిటీస్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌ ద్వారా స్పాన్సర్‌ చేస్తున్నారు.

3.మ్యూచువల్‌ ఫండ్(Mutual fund):ఈ పథకం పేరు యుటిఐ వెల్త్‌ బిల్డర్‌ ఫండ్‌-2. ఈ పథకంలో మీరు మదుపు చేసిన మొత్తంలో 65% షేర్‌ మార్కెట్‌లో మదుపు చేస్తారు. మిగిలిన 35% బంగారంపై మదుపు పెడతారు. మార్కెట్‌ హెచ్చుతగ్గులను బట్టి 65 నుంచి 75శాతం షేర్‌ మార్కెట్‌లో మదుపు చేయడంకానీ, 25 నుండి 35 శాతంవరకు బంగారంపై మదుపు చేసేందుకు ఫండ్‌ మేనేజర్‌ నిర్ణయం తీసుకుంటాడు. ఈ పథకంలో ఎప్పుడైనా కూడా చేరవచ్చు. ఎప్పుడైనా వైదొలగవచ్చు. ఎందుకంటే ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఇందులో వచ్చే డివిడెండ్‌లపై పన్ను ఉండదు. పేఅవుట్‌లపై కూడా పన్ను లేదు.

                                                     పేఅవుట్‌ తీసుకొనని పక్షంలో యూనిట్లుగా బదిలీ అవుతాయి. పాత యూనిట్లకు వీటిని కలిపేస్తారు. గ్రోత్‌ ఆప్షన్‌లో డివిడెండ్‌లు ఉండవు. ఏడాది దాటితే వచ్చే లాభాలపై క్యాపిటికల్‌ గెయిన్స్‌ పన్ను ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉండదు. దీంట్లో పద్దతి ప్రకారం మదుపు పెట్టే సావకాశం (ఎస్‌ఐపి) కూడా ఉంది. ఇందులో మదుపుకు కనీస మొత్తం రూ.500లు, గరిష్ట పరిమితి రూ.5వేలు. ఈ పథకంలో ఎప్పుడైనా మదుపు పెట్టవచ్చు. లేదా సొమ్ము తీసుకోవచ్చు. దీనిని పార్షియల్‌ విత్‌డ్రాయల్‌ అంటారు.





బంగారం కొనేముందు కొన్ని జాగ్రత్తలు

భారతీయ వినియోగదారులకు బంగారంపట్ల మక్కువ ఎక్కువ. బంగారు ఆభరణాలను దగ్గరుంచుకోవడమంటే ఆపద సమయంలో పరిష్కారం సులువైనట్లే. ప్రతి మహిళ జీవితంలో స్త్రీ ధనమనేది చాలా ముఖ్యమైన భాగం. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు జ్యుయలర్ల చేతుల్లో మోసపోతుంటారు. తాము అమ్మేది 22 క్యారెట్ల బంగారమని చెప్పి వారు దాని ప్రకారం ధర వసూలు చేస్తారు.
                                            మనదేశంలో మహిళ బంగారు ఆభరణాలను కేవలం అలంకరణ విలువ గలవిగా మాత్రమేకాక ఆర్థిక భద్రత/వ్యక్తిగత ఆస్తి/స్త్రీ ధనంగా చూస్తుందని, అవసరమొచ్చి నప్పుడు అమ్ముకునే/తాకట్టు పెట్టగల ఆస్తిగా వాటిని పరిగనిస్తుందని, తన పిల్లలకు ఇవ్వాలని కోరుకుంటుందన్నది తెలిసిన విషయమే. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలో మహిళ లకు ఆభరణాలను పెట్టుబడి కింద ద్రవోల్బణంలో ఉపయోగపడగల సాధనంగా కొంటారు. ప్రత్యేక సందర్భాలలో వాటిని ఆభరణాలుగా అలంకరించు కుంటారు. ఎంతో తప్పనిసరి అవసరమొస్తే తప్ప, ఎక్కడా డబ్బు పుట్టకపోతే మినహా వారు వాటిని అమ్మాలనుకోరు.ఇక పెళ్లిళ్ల సీజన్‌ మొదలు కాబోతుంది.

                                           వేసవి అనగానే పెళ్లిళ్లు ఎక్కువ జరుగుతాయి. ఎంత పేదవారైనా పెళ్లంటే కనీసం ఒక తులం లేదా రెండు తులాలైనా కొంటారు. కాబట్టి ఈ సీజన్‌లో బంగారం ధర మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంది. దానికి ఉన్న డిమాండ్‌ను బట్టి బంగారానికి రెక్కలొస్తాయి.అంతేకాక బంగారం కేవలం నగల కోసమే కాక మదుపుమార్గంగా దీన్ని ఎన్నుకుంటు న్నారు. పైగా  వన్నెతరగనిది, విలువ తగ్గనిది. అనాధికాలం నుంచి నేటివరకు బంగారం అంటేనే అతివిలువైన వస్తువు మాత్రమే కాదు అత్యవసరత లో ఆదుకుంటుంది. పండగలు, పెళ్లిల సీజన్‌ వచ్చిందంటే చాలు ఇక వాటికి ఉండే డిమాండ్‌ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంటుంది. బంగారం ఇప్పుడు మంచి లాభాలు గడిస్తోంది. 

అందుకే అనేకులు మదుపరులు అప్పుచేసి కొన్న బంగారాన్ని మదుపు పెడుతున్నారు. బంగారాన్ని కొనాలనుకున్నప్పుడు అప్పు, తర్వాత అమ్మడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిదికాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనదేశం భారీ ఎత్తున బంగారాన్ని ఎగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఒకటి. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటినా దానిపై మోజు ఏ మాత్రం తగ్గలేదు. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర పడుతుం డటంతో బంగారు నగలు కొనడానకి బ్యాంకులు పర్సనల్‌ లోన్స్‌ ఇస్తున్నాయి. ఇటువంటి రుణాలపై వడ్డీ రేట్లు 15-30 శాతం వుంటున్నాయి.

                                                 అసలు బంగారం కొనడానికి అప్పు చేయడంలో విజ్ఞత ఏమాత్రం లేదని నిపుణులు అంటున్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి.
 1.మొదటిదేమి టంటే గత ఐదేళ్లలో మదుపు బంగారంపై లాభాలు పెరిగినా, 1999-2009 మధ్య కాలంలో లాభాలు ఐదుశాతం కంటే తక్కువకు పడిపోయిన సందర్భాలు కూడా ఎన్నో వున్నాయి.
 2.రెండోకారణం ఏమిటంటే టాక్సు, బాండ్లు, రియల్‌ఎస్టేట్‌ మదుపుల వలె బంగారం క్రమబద్ధమైన లాభాలను గడించేది కాదు. బంగారు నగలను మదుపు పెట్టాలంటే బ్యాంకు లాకర్‌లో దాచాలి. అందుకు బాగానే ఖర్చు అవుతుంది. ఏడాదికి 15-20 శాతం దాకా వడ్డీ ఖర్చులు  భరిస్తేనే బంగారాన్ని ఒక ఆస్తిగా మార్చుకోగలం. సంపదను సృష్టించడంలో ఇది ఏమంత ఆరోగ్యకరమైన ధోరణికాదు.
                     మరో విషయం ఏమిటంటే బ్యాంకుల నుంచీ బంగారు బిస్కెట్లను కొనాలంటే ఎక్కువ ఖరీదు అవుతుంది. అందుకు అది శుద్ధ బంగారం కావడం కారణం. బ్యాంకులు తిరిగి ఆ బంగారాన్ని మీ వద్దనుంచి కొనుగోలు చేయవు. అందువల్ల మీరు ఏ నగల వర్తకునికో అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంకుల అమ్మకపు ధర కంటే నగల వర్తకులు  కొనే ధర చాలా తక్కువ. మార్కెట్‌ ధరను బట్టి విలువ లెక్కిస్తారు.
                                                              బ్యాంకుల కొనుగోలు ధర కంటే మార్కెట్‌ ధర ఎప్పుడూ తక్కువగానే వుంటుంది. బ్యాంకులు ఎప్పుడూ ధర రికార్డు స్థాయిలో పెరిగినప్పుడే బంగారం కొనడానికి రుణాలు ఇవ్వజూపుతాయి. కాబట్టి బంగారు నాణేలు, బార్లు, బిస్కెట్ల మదుపుపై  మీరు 15శాతం లాభాలు ఆశించి రంగంలోకి దిగితే ఆ మదుపు బ్రేక్‌ ఈవెన్‌ పాయింటు చేరుకోవడానికి ఏళ్లు పడుతుంది.టువంటి పరిస్థితిలో నగల వర్తకుల వద్ద చిట్‌ఫండ్ల రూపంలో బంగారం కొనడం కూడా సముచితం కాదు.  ఇటువంటి బంగారం పై నగల వర్తకులు ఇవ్వ చూపే లాభాలు 10శాతం కంటే తక్కువ.

పొదుపు ద్వారా బంగారం కొనడం ఎక్కువ లాభదాయకం. 

Ex: ఎలాగంటే నెలకు రూII 3000 పొదుపు చేస్తే 18 నెలలకు ఆ మొత్తం రూII 57,850 అవుతుంది. అప్పుడు కూడా బంగారం ధర అందుబాటులో లేక కొనుగోలును వాయిదావేస్తే మీరు దాచుకున్న డబ్బుపై ఏమీ వడ్డీ రాదని తెలుసుకోవాలి.
ఈ సీజన్‌లో అమ్మేందుకు మదుపుదారులు అప్పు చేసి, బంగారాన్ని కొని, నిల్వఉంచుకుని, తర్వాత అమ్ముకోవాలని చూస్తారు. కానీ వచ్చిన కాస్త లాభాలు తీసుకున్న అప్పుకు వడ్డీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. దీంతో లాభం మాట ఎలాగున్నా, నష్టాలు వస్తాయి. బంగారం కొనడానికి పర్సనల్‌లోన్‌ తీసుకోవడం కంటే మీ జీవిత బీమా పాలసీ లేదా సేవింగ్స్‌ సర్టి ఫికెట్స్‌ను తాకట్టు పెట్టడం మంచిది. వీటిపై వడ్డీ రేటు 10-12 శాతం మాత్రమే వుంటుంది.

ఇంతకీ  కొన్న బంగారం ఒరిజనలా నకీలీనా కనుక్కోవడమెలా:

                                           ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే బంగారంలో 40 శాతం  భారత్ లో అమ్ముడవుతోంది.  మొత్తం దేశవ్యాప్త అమ్మకాల్లో 50 శాతం వాటా దక్షిణాది రాష్ర్టాలదే..అందులోనూ కేరళ వాటా 15 నుంచి 20 శాతం ఉంటుంది. కేరళలో రోజుకు ఒక టన్ను బంగారం ఆభరణాల రూపంలో మారుతుంది. ఇప్పుడు  బంగారమంటే నగల కోసమనే  రోజులు పోయాయి. ఇప్పుడిదో  సేఫెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ కూడా.  అందుకే పండుగ రోజు బంగారం కొనాలన్న ఆరాటమే కాదు..వ్యాపారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యం.

                                       గోల్డ్ తో డైరెక్ట్ గా ఆభరణాలు తయారుచేయడం కుదరదు. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ మెటల్ . అందుకే ముందుగా బంగారాన్ని 1064 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రత వద్ద వేడి చేస్తారు. ఆ తరువాత  2808 డిగ్రీల వద్ద కరిగిస్తారు. ఈ ప్యూర్ గోల్డ్ లో   కాపర్ , సిల్వర్, పల్లాడియమ్ , నికిల్ ను మిక్స్ చేస్తారు. దీన్నే గోల్డ్ ఎల్లాయ్ అంటారు. ఇది మాత్రమే జ్యుయలరీ కి అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు కొనే జ్యుయలరీ 100 పర్సెంట్ ప్యూర్ గోల్డ్ కాదన్నమాట.
బంగారంలో రకాలు:. 
                                24 క్యారెట్, 22 , 18, 14, 9   క్యారెట్‌ గోల్డ్‌గా ఇలా పిలుస్తుంటారు. గోల్డ్ లో కలిపే మెటల్స్ క్వాంటిటీని బట్టి అది ఎన్ని క్యారెట్ల బంగారం అన్న దాన్ని డిసైడ్ చేస్తారు. గోల్డ్ నాణ్యత కు ఇచ్చే సర్టిఫికేషనే హాల్ మార్క్ అంటారు.  దీన్నే  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్  అనే ఏజెన్సీఇస్తుంది. అందుకే  బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న గోల్డ్  పర్ ఫెక్ట్ అని అంటుంటారు.   అందుకే ఎవరైనా గోల్డ్ షాపులకు వెళ్లేటప్పుడు  బిఐఎస్  హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయండి..అని చెప్తుంటారు.

                                ఇక  ప్రతి 1000 పార్టులకు 999.9 పార్టులు గోల్డ్  కనుక ఉంటే దాన్ని 24 క్యారెట్లు అంటారు. 22 క్యారెట్ లో ఐతే 916 పార్టులు గోల్డ్ ,మిగతా  84 పార్టులు వైట్ మెటల్స్ కలుపుతారు. ప్రస్తుతం మనం ఏ గోల్డ్ షాపు యాడ్స్ చూసినా bis 916 హాల్ మార్క్ గోల్డ్ మా ప్రత్యేకం అని చెప్తుంటారు. అంటే మనం కొనేది 22 క్యారెట్ గోల్డ్ అన్నమాట. ఇక 18 క్యారెట్లలో  750 పార్టులు, 14 క్యారెట్లలో 585 పార్టులు , 9 క్యారెట్లు 375 పార్టులు గోల్డ్ ...మిగతా దంతా వేరే మెటల్స్ కలుపుతారన్నమాట.
మీరు కొనే బంగారం...ప్యూర్ దేనా ..కాదా అని చాలామందికి డౌట్
.                                     ఒక్కోసారి ఐతే  అన్నీ చెక్ చేసి కొనుక్కున్నా...కొంతమంది కస్టమర్లు మోసపోతుంటారు. నగల ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఐతే కస్టమర్లు మరింత జాగ్రత వహించక తప్పదంటున్నారు కొంతమంది నిపుణులు. ఇంతకీ మీరు కొనే బంగారం ...ప్యూర్ గోల్డేనా  గోల్డ్  కొనుగోలు చేసే ముందు వాటి స్వచ్ఛతకు చిహ్నంగా ముద్రించే హాల్‌మార్క్‌ను పరిశీలించాకే కొనుగోలు చేసినా... ఒకసారి జ్యూయలరీ చేయించుకున్న తర్వాత వాటిలో ప్యూరిటీ శాతం ఎంతనేది పసిగట్టడం కష్టమే. ఆభరణాన్ని కరిగించకుండా దానిలో ఉన్న బంగారమెంతో చెప్పడం సాధ్యం కాదు. దీన్ని ఆసరా చేసుకునే వ్యాపారులు మోసానికి పాల్పడతారు. తమ దగ్గర కొన్న ఆభరణాలను... తిరిగి తమ వద్దే మార్చుకుంటే.. తరుగు లేకుండా నిలువు తూకం లెక్కకడతామని గ్యారెంటీ ఇస్తారు. అంటే... ఆభరణంలో తక్కువ బంగారం... ఎక్కువగా ఇతర మెటల్స్‌ ఉన్నా... కొన్నప్పటి తూకాన్నే లెక్కిస్తారు. ఈ విషయంలో కొనుగోలుదారులు తగిన జాగ్రత్తలు పాటించాలంటే ఒక్కటే మార్గం. నమ్మకమైన  షాపుల్లో మాత్రమే గోల్డ్ కొనుగోలు చేయాలి. 

 ప్యూరిటీ మార్క్‌ ముద్రించిన నగలు కొనుగోలు చేయడం చాలా సేఫ్. ఐతే ఇన్నీ చేసినా...మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకే: మీరు చైనో లేక ఇయర్ రింగ్స్ కాని కొన్నారనుకోండి. బిఐఎస్ (BAS) హాల్ మార్క్ ముద్రను వెనక చీలకు మాత్రం ఇస్తాడు...ముందు రింగుకు మాత్రం ఇవ్వరూ..అదే చైనులాంటివి తీసుకున్నారనుకోండి..డాలర్ కు బీఎస్ ఐ మార్కు ఉంటుంది..చైనుకు మాత్రం ఉండదు...ఇలానే కస్టమర్లు మోసపోతుంటారన్నమాట.
                                       సో ఇకనుంచి బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ అన్నింటిపై ఉందా లేదా అని చెక్ చేసుకోండి. చిన్న రింగ్ నుంచి ..కాస్ట్లీ ఐటమ్స్ వరకు అమ్మకందారులు చెప్పే ప్రతిదానిని కస్టమర్లు నమ్మడానికి లేదు. వారు తరుగు ఎంత తీస్తున్నారు. డిస్కౌంట్లు , ఆఫర్లు అంటూ చెప్పే మాటలు నిజమేనా. లక్షలు ఖర్చుపెట్టి గోల్డ్ షాపు వాళ్లు ఇచ్చే యాడ్ లు చూస్తే..వీరికి ఇంత లాభం ఎలా వస్తుందా అని బోలెడన్నీ డౌట్లు వస్తుంటాయి. ఇంతకీ బిహైండ్ ద సీక్రెట్ ఏంటి తరుగు, డిస్కౌంట్ల గురించి సేల్స్ మెన్స్ చెప్పే దాన్నే నమ్మకండి...మీరు ఒకటికి పదిచోట్ల ఎక్కడ ఎంత తరుగు, మేకింగ్ ఛార్జీలు తీసుకుంటాన్నారు అన్న విషయాన్ని  కనుక్కునే ..బంగారాన్ని కొనుక్కోండి.  గోల్డ్ ఎక్స్చేంజ్ కు ఎంత వసూలు చేస్తున్నారన్నది కూడా కనుక్కోండి.  గోల్డ్ షాపులకు వాళ్లకు వచ్చే లాభమంత మజూరీ, తరుగే. చిన్న చైను నుంచి ..ప్రతిదానిలో వేస్టేజ్ , మేకింగ్ ఛార్జ్ అంటూ ఐటమ్ ను బట్టి  5 నుంచి 15 శాతం వరకు వసూలు చేస్తుంటారు కొంతమంది షాపుల వాళ్లు. సో బీ కేర్ ఫుల్ 
                                        So be carefulllllllllllllll

Thứ Hai, 15 tháng 4, 2013

Procedure To Check Your 2G GPRS Data Balance For All Operators

Here is the procedure to check the 2G data usage balance for all telecom operators.
Please let me know through comments if there are any mistakes in the list.
Aircel: Dial *111*10#
Airtel:Dial *123*10#
BSNL: Send SMS DATA2G to 53733
Tata Docomo(GSM): Dial *191#
Vodafone: Dail *111# and select option 6
Reliance (GSM): send SMS BBAL your mobile number to 53535
Idea: send SMS USAGE to 58880
Videocon: Dial *123#

source:http://www.worldofgprs.com/2013/04/procedure-to-check-your-2g-gprs-data-balance-for-all-operators/?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+WorldOfGprs+%28WORLD+OF+GPRS%29

Thứ Bảy, 13 tháng 4, 2013

Know Your Mobile Number For All Operators (Even At Zero Balance)

Sometimes we forget our own mobile number especially for the numbers which we just use for browsing or for some reduced call rates.
When we plan to recharge it we find that we dont know the number! :) and sadly there will be no balance in the number for atleast putting a miss call.
We cant do any online or easy reacharges. The only way will be to do a paper recharge and in most cases we find it tedious.
Today I am sharing you some official tricks to know your mobile number. If there are any mistakes please let me know through your comments.
Aircel: Dial *131*0#
Airtel: send blank SMS to 59103 you will get your mobile number as reply or Dial *121*9#
BSNL: Dial *888#
Tata Docomo(GSM): Dial *1#
Tata Docomo(CDMA):Dial *1#
Vodafone: Dail *131*0#
Reliance (GSM): Dial *1#
Reliance(CDMA): Dial *1#
Idea: Dial *1#
MTS: send SMS NUM to 51230
Videocon: Dial *1#

Thứ Sáu, 12 tháng 4, 2013

వ్యాపారావకాశాల కోసం ఫేస్‌బుక్‌(FACEBOOK)

భారత కంపెనీలు సామాజిక నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవడం ద్వారా కొత్త వ్యాపారావకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ ఏడాది ఫేస్‌బుక్‌ వంటి నెట్‌వర్క్‌లు, బ్లాగులతో పాటు ట్విటర్‌ వంటి మైక్రోబ్లాగుల వాడకాన్ని అధికం చేసినట్లు ఓ సర్వే వెల్లడించింది. సామాజిక మీడియా లేకుండా మార్కెటింగ్‌ వ్యూహాలు విజయవంతం కాలేవని 83 శాతం భారత కంపెనీలు అభి ప్రాయపడుతున్నట్లు ఆఫీస్‌ స్పేస్‌ సొల్యూషన్ల సంస్థ రీగస్‌ వెల్లడిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది 80 దేశాల్లో మొత్తం 17,000 మంది మేనేజర్లు, వ్యాపార సంస్థల అధిపతులపై సర్వే జరిపింది. ఆ సర్వేలోని ఇతర ప్రధానాంశాలు..

అంతర్జాతీయంగా 74 శాతం కంపెనీలు వ్యాపారావకాశాలు మెరుగుపరచుకోవాలంటే సామాజిక వెబ్‌సైట్ల వాడకం తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయంగా 52 శాతం సంస్థలు, భారత్‌లో 64 శాతం కంపెనీలు తమ ప్రస్తుత వినియోగదార్లకు సమాచారాన్ని అందించడానికి ట్విటర్‌, వెబోలను వాడుతున్నాయి. భారత్‌లో 67 శాతం కంపెనీలు లింక్డ్‌ఇన్‌, జింగ్‌, వీడియో వంటి సామాజిక నెట్‌వర్క్‌లలో చేరమని తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తుండడం గమనార్హం.

అంతర్జాతీయంగా ఐదింట రెండొంతులు లేదా 39 శాతం; భారత్‌లో 49% సంస్థలు తమ మార్కెటింగ్‌ బడ్జెట్‌లో 20 శాతాన్ని సామాజిక నెట్‌వర్కింగ్‌ కార్యకలాపాల ద్వారా వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. సామాజిక వెబ్‌సైట్ల ద్వారా కొత్త వినియోగదార్లను ఆకట్టుకోవడంలో విజయం సాధించామని 2010లో 52 శాతం భారత కంపెనీలు అభిప్రాయపడ్డాయి.ఈ ఏడాది వీరి సంఖ్య 61 శాతానికి పెరగడం విశేషం.

అంతర్జాతీయంగా సామాజిక మీడియా 'ఉంటే బావుంటుంది' అనే స్థాయి నుంచి 'కచ్చిత అవసరం' స్థాయికి చేరింది. సంప్రదాయ, డిజిటల్‌ సాంకేతిక విజ్ఞానాలను కలిపి ఉపయోగించుకోకపోతే మార్కెటింగ్‌ ప్రచారాలు పనిచేయవని 66% భారత, 61% ప్రపంచ కంపెనీల అభిప్రాయం.