భారత కంపెనీలు సామాజిక నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవడం ద్వారా కొత్త వ్యాపారావకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ ఏడాది ఫేస్‌బుక్ వంటి నెట్‌వర్క్‌లు, బ్లాగులతో పాటు ట్విటర్ వంటి మైక్రోబ్లాగుల వాడకాన్ని అధికం చేసినట్లు ఓ సర్వే వెల్లడించింది. సామాజిక మీడియా లేకుండా మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతం కాలేవని 83 శాతం భారత కంపెనీలు అభి ప్రాయపడుతున్నట్లు ఆఫీస్ స్పేస్ సొల్యూషన్ల సంస్థ రీగస్ వెల్లడిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది 80 దేశాల్లో మొత్తం 17,000 మంది మేనేజర్లు, వ్యాపార సంస్థల అధిపతులపై సర్వే జరిపింది. ఆ సర్వేలోని ఇతర ప్రధానాంశాలు..
అంతర్జాతీయంగా 74 శాతం కంపెనీలు వ్యాపారావకాశాలు మెరుగుపరచుకోవాలంటే సామాజిక వెబ్‌సైట్ల వాడకం తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయంగా 52 శాతం సంస్థలు, భారత్‌లో 64 శాతం కంపెనీలు తమ ప్రస్తుత వినియోగదార్లకు సమాచారాన్ని అందించడానికి ట్విటర్, వెబోలను వాడుతున్నాయి. భారత్‌లో 67 శాతం కంపెనీలు లింక్డ్‌ఇన్, జింగ్, వీడియో వంటి సామాజిక నెట్‌వర్క్‌లలో చేరమని తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తుండడం గమనార్హం.
అంతర్జాతీయంగా ఐదింట రెండొంతులు లేదా 39 శాతం; భారత్‌లో 49% సంస్థలు తమ మార్కెటింగ్ బడ్జెట్‌లో 20 శాతాన్ని సామాజిక నెట్‌వర్కింగ్ కార్యకలాపాల ద్వారా వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. సామాజిక వెబ్‌సైట్ల ద్వారా కొత్త వినియోగదార్లను ఆకట్టుకోవడంలో విజయం సాధించామని 2010లో 52 శాతం భారత కంపెనీలు అభిప్రాయపడ్డాయి.ఈ ఏడాది వీరి సంఖ్య 61 శాతానికి పెరగడం విశేషం.
అంతర్జాతీయంగా సామాజిక మీడియా 'ఉంటే బావుంటుంది' అనే స్థాయి నుంచి 'కచ్చిత అవసరం' స్థాయికి చేరింది. సంప్రదాయ, డిజిటల్ సాంకేతిక విజ్ఞానాలను కలిపి ఉపయోగించుకోకపోతే మార్కెటింగ్ ప్రచారాలు పనిచేయవని 66% భారత, 61% ప్రపంచ కంపెనీల అభిప్రాయం.
Không có nhận xét nào:
Đăng nhận xét