బంగారం కొనాలంటేనే భయం వేస్తుంది. రోజు రోజుకు దీని ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ పదిగ్రాముల బంగారం రూ.18వేల చిల్లర ఉండేది. ఇప్పుడు రూ.20వేల వరకూ పలుకుతున్నది. ఇక పెళ్లిళ్ల సీజన్, పండగలప్పుడు దీనిధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు బంగారాన్ని సంపదకు ఒక చిహ్నంగా, హోదాకు గుర్తుగా భావించేవారు.
ధనవంతులు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేసి, ఆభరణాలను చేయించుకుని, ఒంటినిండా నగలతో సమాజంలో గొప్పవ్యక్తులుగా చలామణి అయ్యేందుకు ఆసక్తి చూపేవారు. ఆ నగలతోనే సమాజంలోనే అత్యంత ధనవంతులుగా కీర్తిని గడించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్థిక సంక్షోభాల కారణంగా పెట్టుబడి దృష్టితో కొనుగోలు చేసేవారి సంఖ్య రానురాను పెరిగి పోతున్నది. అంతేకాక ఇప్పుడు కాంచనం రూ. 19వేలకు పైగా ధర పలకడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
బంగారం కొనుగోలు పెరిగేందుకు, వీటి ధరలు పెరిగేందుకు కొన్ని కారణాలున్నాయి. అవి ఏంటో గమనిద్దాం.
మార్కెట్ పతనమైనప్పుడు :మార్కెట్లు భారీగా పతనం అయినప్పుడల్లా ఈక్విటీల్లో పెట్టుబడిపెట్టే మదుపర్లు, సంరక్షత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటు న్నారు. మార్కెట్లో తగ్గుదలలు నమోదైనప్పుడల్లా బంగారం ధర పెరుగుతున్నది. సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారానికి పేరున్నప్పటికీ, క్రమం తప్పకుండా ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఇతర పథకాలతో పోలిస్తే బంగారానిది కాస్త వెనకబాటే. షేర్లు, లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు డివిడెండు వచ్చేందుకు అవకాశం ఉంది. బాండ్లు, ఫిక్సెడ్ డిపాజిట్లలో మదుపు చేసినపుడు వడ్డీ రూపంలో క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంది. స్థిరాస్తిలో మదుపు చేయడం ద్వారా అద్దె రూపంలో ఆదాయం ఆర్జించడానికి సాధ్యమవుతుంది.
సంప్రదాయ నగలు, నాణేల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు అనుబంధంగా ఉండే ఖర్చులవల్ల తిరిగి అమ్మిన ప్పుడు పెద్దగా లాభం ఏమీ ఉండకపోవచ్చు. పైగా తరుగుదల భయం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా బంగారంలో మదుపు చేస్తూనే మన పెట్టుబడి వృద్ధి చెందాలి? పైగా క్రమం తప్పకుండా ఆదాయం రావాలి అని భావించే వారికి ఓ ప్రత్యా మ్నాయం ఉంది. బంగారాన్ని నిజంగా కొనాల్సిన అవసరం లేకుండానే అందులో మదుపు అవకాశం కల్పించేవి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఫండ్ల గురించి తెలిసిందే కదా! ఇందులో మన దగ్గరున్న సొమ్ము ఆధారంగా ఎంత వీలైతే అంత పెట్టుబడి పెట్టవచ్చు. మనం చేయాల్సింది ఏమిటంటే మనం కాంచనానికి కేటాయించాలనుకున్న మొత్తంలో కొంత భాగం లిక్విడ్ ఫండ్లకు కేటాయించడం ఉత్తమం
సంప్రదాయ నగలు, నాణేల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు అనుబంధంగా ఉండే ఖర్చులవల్ల తిరిగి అమ్మిన ప్పుడు పెద్దగా లాభం ఏమీ ఉండకపోవచ్చు. పైగా తరుగుదల భయం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా బంగారంలో మదుపు చేస్తూనే మన పెట్టుబడి వృద్ధి చెందాలి? పైగా క్రమం తప్పకుండా ఆదాయం రావాలి అని భావించే వారికి ఓ ప్రత్యా మ్నాయం ఉంది. బంగారాన్ని నిజంగా కొనాల్సిన అవసరం లేకుండానే అందులో మదుపు అవకాశం కల్పించేవి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఫండ్ల గురించి తెలిసిందే కదా! ఇందులో మన దగ్గరున్న సొమ్ము ఆధారంగా ఎంత వీలైతే అంత పెట్టుబడి పెట్టవచ్చు. మనం చేయాల్సింది ఏమిటంటే మనం కాంచనానికి కేటాయించాలనుకున్న మొత్తంలో కొంత భాగం లిక్విడ్ ఫండ్లకు కేటాయించడం ఉత్తమం
బంగారంపై మదుపుపెట్టటమంటే కమోడిటీ ఇన్వెస్ట్‌మెంటే. బంగారం మదుపు మార్గాల్లో అనేక సాధనాలుంటాయి. వీటిలో 03 మూడు రకాల మదుపు మార్గాలు ముఖ్యమైనవి.
1. గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (గోల్డ్ ఇటిఎఫ్) 2. గోల్డ్ హార్వెస్ట్ స్కీం 3.మ్యూచువల్ ఫండ్ (పాక్షికంగా).
1.గోల్డ్ ఇటిఎఫ్(Gold Exchange Traded Funds) లో మదుపు ఎలా :ప్రత్యేకించి దీనికి డీమాట్ ఖాతా(Demat Account) తెరవాలి. బంగారాన్ని భౌతికంగా దగ్గర అట్టేపెట్టుకుంటే అనేక రకాల రిస్కులు ఎదురవుతాయి. కాబట్టి గోల్డ్ ఇటిఎఫ్‌లో మదుపు చేస్తే లాభాలు సైతం గడించవచ్చు. ఈ పథకంకింద ప్రతీ గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. రోజువారీ మార్కెట్ ధర ప్రకారం బంగారం కొనడం, అమ్మడం జరుగుతూఉంటుంది. ఈ రకం మదుపులో మీరు బంగారాన్ని కేవలం కాగితంపైనే కొంటారు. ఆ బంగారం తెచ్చి మదుపు పెట్టటం ఉండదు. అనేక కంపెనీల గోల్డ్ ఇటిఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటికీ స్టాక్ బ్రోకర్లు ఉంటారు.
మీ వద్ద అందుబాటులో ఉన్న మదుపు మొత్తం గురించి వారికి చెబితే అనువైన కంపెనీ ఇటిఎఫ్ బుక్ చేస్తారు. మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌బిఐ, కోటక్, యుటిఐ వంటి అనేక కంపెనీల గోల్డ్ ఇటిఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ బ్రోకర్ ద్వారా అనువైన కంపెనీలో మీ వద్ద ఉన్న మొత్తాన్ని మదుపు పెట్టవచ్చు. నేరుగా బంగారాన్ని కొనాల్సిన అవసరంలేదని ముఖ్యంగా గమనించాలి. మీరు మదుపు పెట్టిన మొత్తంపై బంగారం మార్కెట్ ధరను బట్టి మీకు లాభనష్టాలు ఉంటాయి. మార్కెట్‌లో మీ గోల్డ్ యూనిట్‌లను అమ్మిపెట్టమని స్టాక్ బ్రోకర్‌ను ఎప్పుడైనా మీరు కోరవచ్చు. అప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం మీకు లాభనష్టాలు ఉంటాయి.
బంగారాన్ని భౌతికంగా దగ్గర అట్టేపెట్టుకుంటే అనేక రకాల రిస్కులు ఎదురవుతాయి. ఆ బంగారాన్ని భద్రంగా చూసుకోవాలి. అందుకు మీరు గోల్డ్ లాకర్ తెరిస్తే చాలా ఖర్చవుతుంది. దగ్గరుంచుకుంటే ఏరకంగానైనా పోగొట్టు కునే ప్రమాదం ఉంటుంది. బంగారాన్ని నగల రూపంలోకి మార్చుకోవడానికి మజూరీ ఖర్చులు అవుతాయి. తరుగులు కూడా ఉంటాయి. కాబట్టి నేరుగా బంగారాన్ని దగ్గరపెట్టుకోవడం లాభసాటి కాదు కనుక మదుపు మార్గంగా పనికిరాదు. డీమాట్ ఖాతా పద్దతిలో మదుపు చేయడమే మంచిది కనుక గోల్డ్ ఇటిఎఫ్ మంచి మార్గం.
Note:ఈ మార్గంలో రిస్క్ తప్పించుకోవడానికి బంగారం ధర తగ్గినప్పుడు కొని, ధరపెరుగుతున్న తరుణాన్ని కనిపెట్టి అమ్మివేయడం చేయాలని మదుపరులు గుర్తించుకోవాలి. దీని వల్ల మీపై పడే భారం అంతగా ఉండదు. నామమత్రపు బ్రోకరేజీ చార్జీలనే మీరు భరించాల్సి ఉంటుంది.
2.గోల్డ్ హార్వెష్ట్ (Gold Harvest) పథకం:ఈ పథకాన్ని ఎంచుకున్న రోజున ఉన్న మార్కెట్ ధర ప్రకారం కనీసం ఒక లాట్ (100గ్రాములు) బుక్ అవుతుంది. ఇది కూడా డీమాట్ ఫాంలో ఉంటుంది. స్టాక్ బ్రోకరూ ఉంటాడు. కనీస మదుపుగా రూ.15వేలు ముందుగా చెల్లించాలి. మీరు మదుపు పెట్టాలనుకున్న మొత్తంలో మిగతా ధనాన్ని 12, 24 లేదా 36 నెలల వాయిదాల్లో చెల్లించాలి. మీరు మదుపు చేయదలచిన మొత్తాన్ని రూ.15వేలు పెడుతున్నప్పుడు రాసుకోవాలి.
మెట్యూరిటీ కాలం తరువాత మీకు కావల్సిన రూపంలో బంగారం కడ్డీల రూపంలో తీసుకోవడంగానీ, డీమాట్ రూపంలో కొనసాగించటంగానీ చేయవచ్చు. డీమాట్ ఖాతాలోని బంగారాన్ని కూడా ఎప్పుడైనా అమ్మేయవచ్చు. ఈ పథకంలో 24క్యారెట్ల బంగారాన్ని మదుపు తీసుకుంటారు. ఇందులో ఎప్పుడంటే అప్పుడు ధన లభ్యత (లిక్విడిటి) సదుపాయం ఉంది. అందుకు కొన్ని నామమాత్రపు చార్చీలు చెల్లించాలి. ఇందులో బంగారం తరుగు మైనస్ చేసే ప్రసక్తిలేదు. ఈ పథకంలోకి చెల్లింపులకు పోస్ట్‌డేటెడ్ చెక్కులనే స్వీకరిస్తారు. ఈ పథకాన్ని బిర్లా సన్‌లైట్ వెల్త్ మేనేజ్‌మెంట్ వారు తమ అపోలో సింధూరి కమోడిటీస్ ట్రేడింగ్ లిమిటెడ్ ద్వారా స్పాన్సర్ చేస్తున్నారు.
3.మ్యూచువల్ ఫండ్(Mutual fund):ఈ పథకం పేరు యుటిఐ వెల్త్ బిల్డర్ ఫండ్-2. ఈ పథకంలో మీరు మదుపు చేసిన మొత్తంలో 65% షేర్ మార్కెట్‌లో మదుపు చేస్తారు. మిగిలిన 35% బంగారంపై మదుపు పెడతారు. మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి 65 నుంచి 75శాతం షేర్ మార్కెట్‌లో మదుపు చేయడంకానీ, 25 నుండి 35 శాతంవరకు బంగారంపై మదుపు చేసేందుకు ఫండ్ మేనేజర్ నిర్ణయం తీసుకుంటాడు. ఈ పథకంలో ఎప్పుడైనా కూడా చేరవచ్చు. ఎప్పుడైనా వైదొలగవచ్చు. ఎందుకంటే ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. ఇందులో వచ్చే డివిడెండ్‌లపై పన్ను ఉండదు. పేఅవుట్‌లపై కూడా పన్ను లేదు.
పేఅవుట్ తీసుకొనని పక్షంలో యూనిట్లుగా బదిలీ అవుతాయి. పాత యూనిట్లకు వీటిని కలిపేస్తారు. గ్రోత్ ఆప్షన్‌లో డివిడెండ్‌లు ఉండవు. ఏడాది దాటితే వచ్చే లాభాలపై క్యాపిటికల్ గెయిన్స్ పన్ను ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉండదు. దీంట్లో పద్దతి ప్రకారం మదుపు పెట్టే సావకాశం (ఎస్‌ఐపి) కూడా ఉంది. ఇందులో మదుపుకు కనీస మొత్తం రూ.500లు, గరిష్ట పరిమితి రూ.5వేలు. ఈ పథకంలో ఎప్పుడైనా మదుపు పెట్టవచ్చు. లేదా సొమ్ము తీసుకోవచ్చు. దీనిని పార్షియల్ విత్‌డ్రాయల్ అంటారు.
Không có nhận xét nào:
Đăng nhận xét