కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలన్నా... జాబ్‌మార్కెట్‌లో పోటీని తట్టుకుని మంచి కొలువు సాధించాలన్నా... నిర్దేశిత లక్ష్యాలు తప్పనిసరి. వాటిని చేరుకునే క్రమంలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. అప్పుడే ఏ రోజు అంశాలను ఆ రోజే చదవడం, పరీక్షలు, ప్రాక్టికల్స్‌ల్లో గతంలో కంటే మెరుగైన ప్రతిభ ప్రదర్శించడానికి వీలవుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఏయే స్కిల్స్‌ను అలవర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం!!
రమేశ్, భరద్వాజ్... కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వారి భవిష్యత్ ప్రణాళికల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు.
రమేశ్: కోర్సు పూర్తయ్యాక ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చేరాలనుకుంటున్నాను.
భరద్వాజ్: నాకు నెట్‌వర్కింగ్ అంటే ఆసక్తి. నేను సిస్కోలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా చేరతాను. నేను మూడో సంవత్సరంలో ఉన్నప్పుడే రూటింగ్ అండ్ స్విచ్చింగ్‌లో సిస్కో సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేశాను.
ఇద్దరి మాటలను పరిశీలిస్తే ఎవరు భవిష్యత్ గురించి స్పష్టంగా ఉన్నారో అర్థమవుతుంది. భరద్వాజ్ ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా కోర్సునభ్యసిస్తున్న సమయంలోనే అవసరమైన స్కిల్స్‌ను పెంచుకునేందుకు సంబంధిత అంశాల్లో సర్టిఫికేషన్‌లు పూర్తి చేశాడు. ఇది కెరీర్ లక్ష్యాలను తెలుపుతుంది.
స్పష్టంగా ఉండడం:
ఇంజనీరింగ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. కొందరు లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ వాటిలో స్పష్టమైనవి, కచ్చితమైన లక్ష్యాలు ఉండడం లేదు. ఏయే అంశాలు చదవాలి. జాబ్ మార్కెట్‌కు ఏయే స్కిల్స్ అవసరం తదితర అంశాలపై అవగాహన ఉండాలి. అప్పుడే లక్ష్యంపై స్పష్టత ఏర్పడుతుంది. దాని సాధన దిశగా విద్యార్థులు దూసుకెళ్లాలి.
పూర్తి బాధ్యతను స్వీకరించడం:
సాధారణంగా చాలా మంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టులను నిర్లక్ష్యం చేస్తుంటారు. సబ్జెక్టుల్లో తమకు పట్టు లేదనే భావనతో కొందరు, కఠినమైన సబ్జెక్టులనే భయంతో మరికొందరు వాటిపై అంతగా దృష్టిసారించరు. ఇది సరైన పద్ధతి కాదు. పూర్తి కోర్సులో మంచి మార్కుల శాతాన్ని సాధించాలంటే అన్ని సబ్జెక్టుల్లో ప్రతిభ అవసరం. కాబట్టి కఠినమైన సబ్జెక్టుల ప్రాథమిక సమాచారాన్ని సేకరించండి. వాటిపై లోతైన అధ్యయనం చేయాలి. గత ఫలితాల గురించి ఆలోచిస్తూ అనవసర ఆందోళనలకు తావివ్వొద్దు. అన్ని సబ్జెక్టులను చదవాలనే బాధ్యతను స్వీకరించాలి... మంచి ఫలితాలు వాటంతట అవే సాధ్యమవుతాయి.
తెలివిగా పనిచేయడం:
తెలివిగా పనిచేయడం అంటే? తలపెట్టిన పనిని పూర్తిచేయడానికి శాయశక్తులా కృషిచేయడమే. తెలియని అంశాలను వదిలిపెట్టకుండా అందుకు సంబంధించిన సమాచారాన్ని శోధించాలి. వాటి గురించి పూర్తి అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కేవలం ఫలితాల కోసమే చదవకుండా సబ్జెక్టులపై పట్టు సాధించాలి!!
పరీక్షల్లో పాస్ మార్కులు సాధించేందుకు చాలామంది ఆల్ ఇన్ వన్‌లు, గైడ్స్‌ను ఆశ్రయిస్తుంటారు. వాటి ద్వారా తాత్కాలిక ప్రయోజనాలు సాధ్యమైనా దీర్ఘకాలంలో అంతగా ఉపయోగపడవనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. సబ్జెక్టుపై భావాత్మక పరిజ్ఞానం లేకుంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. ప్రామాణిక బుక్స్, రిఫరెన్స్ బుక్స్‌తోనే సబ్జెక్టుపై విస్తృత పరిజ్ఞానం సాధ్యమవుతుంది.
సబ్జెక్టుకు సంబంధించిన సందేహాల నివృత్తికి రోజుకు కనీసం అరగంట ఇంటర్నెట్‌నుపయోగించడం మంచి అలవాటు. దాని ద్వారా విద్యార్థులు చదువుతున్న బ్రాంచికి సంబంధించిన తాజా ఆవిష్కరణలు, సరికొత్త అంశాల గురించి తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు ఇది ప్రధానం. ఇంటర్నెట్‌లో అందుబాటులోఉన్న అనేక ఆన్‌లైన్ వీడియో లెక్చర్స్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు సబ్జెక్టుపై పట్టు పెంచుకోవచ్చు. ఉదాహరణకు ఎన్‌పీటీఈఎల్... నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ వెబ్‌సైట్‌లో లభించే ఐఐటీ, ఐఐఎస్సీ ప్రొఫెసర్ల వీడియో లెక్చర్స్ ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందొచ్చు. వీటితోపాటు యూట్యూబ్‌లో ఎన్నో రకాల వీడియో పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. క్లాస్‌లో మిస్సయిన అంశాలను ఆన్‌లైన్‌లో నే నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వికీపీడియాలో కూడా విస్తృత సమాచారం అందుబాటులో ఉంది.
లక్ష్య సాధన దిశగా:
మేనేజ్‌మెంట్ రీసెర్చర్, లూథర్ గులిక్ చెప్పిన ్కైఈఇైఖఆ: ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డెరైక్టింగ్, కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్ అండ్ బడ్జెటింగ్‌ను విద్యార్థుల కోసం కింది విధంగా మార్చితే...
* P – Planning our target.
* O – Organizing the steps required to achieve the target
* S – Selecting the proper institute that will help to achieve target
* D – Directing all the efforts to finish activities, necessary to achieve the objective .
* CO – Coordinate daily activities efficiently and effectively,
* R – Recording daily progress, ( at least before going to bed)
* B – Budgeting your expenses which may include staying separately (especially in pre-final and final years of the course), attend coaching for useful extra certificate courses, (For Ex: for Civil Engg students.. AUTOCAD, ARCHICAD, PRIMAVERA, STADDPRO, For CSE students: CISCO, MS, ORACLE courses etc.) cost of applications and start working for the target.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్:
విజయసాధనకు కావాల్సిన ముఖ్య లక్షణాల్లో ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యం. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకున్న వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారని చాలామంది భావిస్తారు. నిజానికి వారు తలపెట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో నిర్వర్తించినందుకే సఫలీకృతులయ్యారనడంలో సందేహం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సిలబస్‌ను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అన్ని సబ్జెక్టులపై దృష్టిసారించాలి. వాటిపై పట్టు పెంచుకునేందకు ప్రయత్నించాలి. అప్పుడే ఇంజనీర్‌గా విజయాలను సాధిస్తారు.
...............
కమ్యూనికేషన్ స్కిల్స్
పదేళ్ల క్రితం వరకూ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పదం పెద్దగా ప్రాచుర్యంలో లేదు. ప్రస్తుతం దీనికి ఎనలేని ప్రాధాన్యం. జాబ్ ఇంటర్వ్యూల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే... ఇప్పుడు కంపెనీల్లో ఒంటరిగా చేసే పని ఏదీలేదు. అంతా టీం వర్కే! అందుకే మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంటేనే టీంలో పనిచేస్తారన్నది కంపెనీల అభిప్రాయం.
కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనిస్, కమ్యూనికేర్ అనే లాటిన్ పదాల నుంచి ఏర్పడింది.
వాటి అర్థం పంచుకోవడం. సమాచారాన్ని పంచుకోవడం, ఆలోచనలు, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఇవన్నీ కమ్యూనికేషన్ కిందికే వస్తాయి. పైవాటిలో ఏ అంశంలో లోపమున్నా సరిగ్గా కమ్యూనికేట్ చేయడం సాధ్యపడదు. సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పకుండా మంచి సంబంధాలను ఏర్పరుస్తాయి. మరో విధంగా చెప్పాలంటే మన ప్రవర్తన, సామాజిక సంబంధాలు మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ప్రతిబింబిస్తాయి.
సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు, వింటున్న ప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనసు కమ్యూనికేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉంటుంది. మన కార్యకలాపాలను వ్యక్తపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఒక సమగ్ర కమ్యూనికేషన్‌లో వెర్బల్, నాన్ వెర్బల్ గుర్తులు, శబ్దాలు భాగంగా ఉంటాయి. కమ్యూనికేషన్ మన జీవితం, కెరీర్‌లో అంతర్భాగమైనందున స్పష్టమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి అవుతున్నాయి. వాటి ద్వారా వ్యక్తిగత ఆసక్తులను కూడా అర్థం చేసుకోవచ్చు.
కమ్యూనికేషన్‌లో ముఖ్యమైనది భాష. ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లిష్‌పై పట్టు తప్పనిసరి. ఒకరకంగా చెప్పాలంటే కమ్యూనికేషన్‌లో ఇంగ్లిష్ భాష బలమైన వారధిలా పనిచేస్తోంది. ఒక మంచి కమ్యూనికేటర్ మాత్రమే వెర్బల్, నాన్‌వెర్బల్, సాంకేతిక, మాస్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిస్థితులకు అనుగుణంగా ప్రయోగించగలడు. భాషతోపాటు విభిన్న రకాలుగా కూడా కమ్యూనికేట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు సంజ్ఞలు, ముఖ కవళికలు, చిత్రాలు... ఇవన్నీ కమ్యూనికేషన్ సాధనాలే.
కమ్యూనికేటివ్ విధానం ఆధారంగా భాషా ప్రావీణ్యాన్ని అంచనా వేయొచ్చు. కొందరు భాషపై పట్టు ఉన్నప్పటికీ కమ్యూనికేషన్‌లో విఫలమవుతుంటారు. అలాంటివారు కమ్యూనికేటివ్ విధానంపై కూడా అవగాహన పెంచుకోవాలి. నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు, వాక్యాలపై ఎక్కువ దృష్టి సారించాలి. జాబ్ ఇంటర్వ్యూల సమయంలో అది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇంగ్లిష్‌ను సరిగా మాట్లాడలేకపోతున్నామని భావించేవారు దానిపై పట్టు పెంచుకోవాలి.
ప్రయోజనాలు:
ఇంజనీరింగ్ అభ్యర్థులు అవకాశాలను అందిపుచ్చుకోవా లంటే అత్యుత్తమ సామర్థ్యాలు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి!
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కళాశాలల్లోనూ, కంపెనీల్లోనూ అనేక మందితో మంచి నెట్‌వర్క్ ఏర్పడుతుంది. తద్వారా కెరీర్ అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
కమ్యూనికేషన్ స్కిల్స్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన, భావోద్వేగాలపరంగా సమతుల్యం ఏర్పడుతుంది.
ఇంటర్వ్యూల్లోనూ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రదర్శించడం ద్వారా ఇంటర్వ్యూర్‌ను ఆకట్టుకోవచ్చు.
ఇంజనీరింగ్ రంగాల్లో ప్రాజెక్టులకనుగుణంగా ప్రణాళికలను రూపొందించడం, వాటి గురించి సంస్థలకు సరిగ్గా కమ్యూనికేట్ చేయడం ప్రధానం. ప్రాజెక్టుల్లో ఎప్పటికప్పడు వస్తున్న మార్పులను బృందంలోని సభ్యులందరినీ సమన్వయ పర్చుకోవడానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమవుతాయి.
Không có nhận xét nào:
Đăng nhận xét