Thứ Sáu, 26 tháng 4, 2013

వేసేవిలో కరెంటు బిల్లు తగ్గించుకోండిలా

మేమిద్దరం ఉద్యోగస్తులు. పొద్దున్న వెళ్తే రాత్రి ఇంటికి వస్తాం. ఇంట్లో చెప్పుకోదగ్గ ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా లేవు. కాని నెల అయ్యేసరికి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. కారణమేమిటాని చాలామంది మహిళలు ఆందోళన చెందుతూ ఉంటారు. బిల్‌ ఎక్కువగా రావడానికి ఇతర కారణాలు కూడా చాలా ఉంటాయి.  అవేమిటో ఇపుడు తెలుసుకుందామా!.ప్రతి నెల కరెంటు బిల్లు చూడగానే మనకు షాక్ కొట్టినట్లౌతుంటుంది. చాలాసార్లు కరెంటు బిల్లుపై ఇంట్లో వాదోపవాదాలు చెలరేగుతుంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఆలోచించేదేంటంటే తాము కరెంటు తక్కువగానే వాడుతున్నామే..అయినాకూడా బిల్లు ఎందుకింత వచ్చింది అని.

1. కరెంటు బిల్లు ఎక్కువగా రావడానికి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాతవి కావడం కూడా ఒక కారణం. ఎలక్ట్రానిక్‌ వస్తువులు పది సంవత్సరాలు పైబడిన వాటిని వెంటనే మార్చుకోవడమే మంచి పద్ధతి. తాతల కాలం నాటినుంచీ వాడుతున్న బల్బులకు 60 వాట్‌లు, ట్యూబ్‌లైట్లకు 36 వాట్‌ల కరెంటు అవసరం అవుతుంది. అదే కాంపాక్టు ఫ్లోరోసెంట్‌ ల్యాంపుల(సీఎఫ్‌ఎల్‌)కు 11-15 వాట్‌లు అయితే సరిపోతుంది.

2. ఫ్రిజ్‌ కింద బేస్‌మెంట్‌ సరిగా లేకపోతే కూడా  కరెంట్‌ అధికంగా కాలుతుంది. ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచకుండా అవసరమున్నపుడు కొద్దిగంటలు వేసుకుని ప్లగ్‌ తీసేసి పెట్టడం ద్వారా కూడా కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు.రిఫ్రిజిరేటర్‌ కాయిల్స్‌ను తరచుగా వ్యాక్యూమింగ్‌ చేయి స్తుండాలి. అలాగే ఎండ ఎక్కువగా పడనిచోట రిఫ్రిజిరేటర్‌ను పెట్టాలి. నేరుగా ఫ్రిజ్‌ మీద పడే ఎండ వల్ల ఫ్రిజ్‌కు అధిక కరెంటు అవసరమవుతుంది. స్థలాభావం వల్ల ఫ్రిజ్‌, ఓవెన్‌ పక్కపక్కన పెట్టాల్సి వస్తే రెండింటి మధ్య ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా అడ్డుగా ఏదైనా పెట్టాలి

3.వేసవికాలం, చలికాలాల్లో కిటికీలను కర్టెన్లు లేకుండా పూర్తిగా తెరిచిపెట్టకండి.  కిటికీలకు ఎపుడూ కర్టెన్లు వేసి పెట్టాలి. ఎండ ఎక్కువగా ఉన్నపుడు అధిక వేడి నేరుగా ఇంట్లోకి రాకుండా కర్టెన్లు అడ్డుకుంటాయి. వాతావరణం చల్లగా ఉన్నపుడు కేవలం మధ్యాహ్నాలు మాత్రమే కర్టెన్లు తీయడమో లేదా కిటికీలు తెరవడమో చేయాలి. ఇలా చేయడం వల్ల చలిగా ఉన్నపుడు వెచ్చదనంకోసం, వేడి వాతావరణంలో చల్లదనంకోసం అదనపు కరెంటును కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

4.వాషింగ్‌ మెషిన్‌ను ఉపయోగించే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాగే వాషింగ్‌ మెషిన్‌లో ఉండే వార్మ్‌/ కోల్డ్‌, హాట్‌/వార్మ్‌, హాట్‌/కోల్డ్‌ స్విచ్‌లలో వార్మ్‌/ కోల్డ్‌ను మాత్రమే ఉపయోగించడం వల్ల కరెంటును ఆదా చేయవచ్చు.వేడిగావున్న పదార్థాలు చల్లబడ్డ తర్వాత మాత్రమే వాటిని ఫ్రిజ్‌లో ఉంచండి. దీంతో విద్యుత్ వినియోగం తక్కువ మోతాదులో జరుగుతుంది.

5.మీ ఫ్రిజ్‌లో  ఆటోమాటిక్‌ ఢీఫ్రాస్ట్‌ ఉంటే సరిలేకుంటే, తరచుగా ఫ్రిజ్‌ను మాన్యువల్‌ డీఫ్రాస్ట్‌ చేస్తుండాలి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు మంచి కండిషన్‌లో పనిచేస్తే మీ నెలవారీ కరెంటు బిల్లులో చాలా మార్పులువస్తాయి.

6.తలుపులు, కిటికీలు తుడవడానికి ఖరీదైన క్లీనర్లకు బదులు వెనిగర్‌, గోరువెచ్చని నీళ్ల మిశ్రమాన్ని ఉపయోగించండి. ముఖ్యంగా పిల్లలు కంప్యూటర్‌, టి.వి. ఫాన్లు ఆఫ్‌ చేయకుండా వెళ్ళిపో తుంటారు. ఇందువల్ల కూడా కరెంటు బిల్లులు పెరిగిపోతుంటాయి. ఇలాంటి చిన్ననాటినుంచే నేర్పిస్తే కరెంటు ఖర్చు మరికాస్త తగ్గుతుంది. 

7.విద్యుద్వినియోగం తక్కువగా ఉండే ఉపకరణాలను మాత్రమే కొనండి. డబ్బు ఎక్కువ పెట్టాల్సి వస్తుందని వెనకాడకండి. ఆ మేరకు కరెంటు బిల్లు తగ్గుతుంది.రాత్రి పూట త్వరగా పడుకోవడం అలవాటు చేసుకుంటే, కొంత మేరకు విద్యుత్తును ఆదా చేయవచ్చును. ఒక యూనిట్‌ కరెంటు పొదుపు రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తితో సమానం. కరెంటు పొదుపునకు అనేక మార్గాలున్నా పాటించడానికి మనసు రావడం లేదు. చిన్న చిన్న మార్పులతో ఎంత కరెంటు ఆదా చేయోచ్చో చూడండి

8. కొత్తగా ఎల్‌ఈడీ దీపాలు వచ్చాయి. వీటికి ఒక వాట్‌ కరెంటు సరిపోతుంది. వీటిని బెడ్‌ ల్యాంప్‌లుగా 50 లక్షల పడక గదుల్లో వాడితే ఏటా 30 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చు. సాధారణ జెట్‌ పంపులు వాడితే రోజుకి 2.25 యూనిట్లు ఖర్చవుతుంది. అదే సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్లకు 1.25 యూనిట్లు సరిపోతుంది. చాలా ఇళ్లలో ఫ్యాన్లకు సాధారణ రెగ్యులేటర్‌లు ఉన్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్‌ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.


9.ఇంట్లోనుంచి బయటకు వెళ్లే ముందు స్విచ్చులు ఆఫ్‌ చేసి ఉన్నాయో లేదో గమనించాలి. లేకపోతే మీరు వచ్చేంతవరకు లైట్లు వెలుగుతూ, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. దీంతో కరెంటు బిల్లు ఎక్కువవుతుంది. హీటర్‌ను వాడేవారు పది నుంచి పదిహేను నిమిషాలు పెడితే చాలు. ఫ్రిజ్‌ను సూర్యరశ్శి తగిలే ప్రాంతంలో పెట్టకపోవడం మంచిది. ఫ్లోరోసెంట్‌ బల్బులను వాడటం ఉత్తమం. కరెంటు ఆదాచేయడం అనేది గృహిణి చేతిలోనే ఉంది.

10.ఇంట్లో నెలవారీ ఖర్చుల్లో కరెంటు బిల్లు కూడా ముఖ్యమైందే. పొదుపుగా వాడుకుంటూ కరెంటు ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. వేడి నీటి కోసం గీజర్లకు ప్రత్యామ్నాయంగా సోలార్‌ వాటర్‌ హీటర్‌ ఏర్పాటు చేసుకోవడం మేలు. వీటి వల్ల పర్యావరణానికి మేలు. విద్యుత్తు ఖర్చూ తగ్గుతుంది. మిక్సీ లేదా గ్రైండర్ వాడేటప్పుడు అన్ని రకాల పదార్థాలు సరిగావున్నాయా లేదా చూసుకుని వాడితే మంచిది. మళ్ళీ..మళ్ళీ మిక్సీలు, గ్రైండర్లు వాడే పని తప్పుతుంది. అలాగే టీవీ చూసినంతసేపు చూసి వెంటనే ఆఫ్ చేయండి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

Không có nhận xét nào:

Đăng nhận xét